Pawan Kalyan : ఆంధ్రాలో ప్రజాస్వామ్యం ఉందా? అని డౌట్ వస్తోంది. ఒక వ్యక్తి సాధారణంగా తిరగడానికి కూడా స్వేచ్ఛ లేదా? అసలు పవన్ ను ఎందుకు నిర్బంధించారో ఎవరికీ తెలియదు. ఆయన చేసిన తప్పు ఏంటి? ఆయన నేరస్థుడా? లేకపోతే నోటిఫై క్రిమినలా? బేగం పేట ఎయిర్ పోర్ట్ లో విమానంలో ప్రయాణించడానికి అనుమతి ఇవ్వకపోవడం ఆశ్చర్యకంగా ఉంది. రోడ్డుపై వస్తే ఆపేసి తిరిగి వెళ్లిపోమంటారు.
పవన్ కళ్యాణ్ రీల్ హీరో కాదు.. రియల్ హీరో అని వినిపించుకున్నాడు. పవన్ ఆంద్ర నుంచి వెళ్లిపోకుండా వీసా కావాలా? పాస్ పోర్ట్ కావాలా? అని నినదించారు. పోలీసులు ఆపితే వెనక్కి తిరిగిపోకుండా రోడ్డుపైనే కూర్చున్నాడు. వెనక్కి తగ్గలేదు. పోలీసులతోనే పోరాడాడు. పవన్ రియల్ హీరో అనిపించుకున్నాడు.
ఏపీలో నిర్బంధం ఎందుకు? దేని కోసం? అన్నది అందరూ ఆలోచించాలి. ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఏపీలో పరిణామాలపై స్పందించే హక్కు పవన్ కు ఉంది. బీజేపీ అధ్యక్షురాలు కూడా స్పందించింది. దీన్ని తప్పు పట్టి అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వానికి హక్కు ఎక్కడిది? అసలు పవన్ ఎందుకు బయలు దేరాడో వైసీపీకి తెలియదు. ఎప్పుడో ఫిక్స్ అయిన జనసేన మీటింగ్ ల కోసమే ఆయన ఏపీకి వస్తున్నాడు. చాలా మెచ్చుర్యిటీగా ఆలోచిస్తున్న రాజకీయ నేత పవన్.
ఆంధ్రాలో నిరంకుశ పాలనకు ప్రతి రూపమే పవన్ కళ్యాణ్ పై నిర్బంధాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.