https://oktelugu.com/

RRRలో అలియాబ‌ట్ ఎలా ఉందో తెలుసా..?

రాజ‌మౌళి-రామ్ చ‌ర‌ణ్‌-ఎన్టీఆర్ కాంబినేష‌న్లో ప్ర‌పంచ స్థాయిలో తెర‌కెక్కుతున్న పీరియాడిక‌ల్ డ్రామా RRR. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ డిస్క‌ష‌న్ మొత్తం రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, రాజ‌మౌళి గురించే సాగింది. అల్లూరి పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ ధీర‌త్వం.. కొమ‌రం భీమ్ రోల్ లో ఎన్టీఆర్ శూర‌త్వమే హైలెట్ అయ్యింది. ఈ సినిమాలోని హీరోయిన్ల గురించి డిస్క‌ష‌న్ నార్మ‌ల్ గానే ఉంది. Also Read: భ‌ర్త రామ్ తో ఎంజాయ్ చేస్తున్న కొత్త పెళ్లి కూతురు సునీత‌! అయితే.. ఇప్పుడు రామ్ […]

Written By:
  • Rocky
  • , Updated On : March 15, 2021 / 01:15 PM IST
    Follow us on


    రాజ‌మౌళి-రామ్ చ‌ర‌ణ్‌-ఎన్టీఆర్ కాంబినేష‌న్లో ప్ర‌పంచ స్థాయిలో తెర‌కెక్కుతున్న పీరియాడిక‌ల్ డ్రామా RRR. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ డిస్క‌ష‌న్ మొత్తం రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, రాజ‌మౌళి గురించే సాగింది. అల్లూరి పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ ధీర‌త్వం.. కొమ‌రం భీమ్ రోల్ లో ఎన్టీఆర్ శూర‌త్వమే హైలెట్ అయ్యింది. ఈ సినిమాలోని హీరోయిన్ల గురించి డిస్క‌ష‌న్ నార్మ‌ల్ గానే ఉంది.

    Also Read: భ‌ర్త రామ్ తో ఎంజాయ్ చేస్తున్న కొత్త పెళ్లి కూతురు సునీత‌!

    అయితే.. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ స‌ఖిగా న‌టిస్తున్న అలియా భ‌ట్ లైమ్ లైట్లోకి వ‌చ్చేసింది. ఇవాళ (మార్చి 15) అలియా భ‌ట్ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా RRRలో అలియా ఎలా ఉండ‌బోతోందో చూపించారు జ‌క్క‌న్న‌. ఈ మేర‌కు ట్విట‌ర్ ద్వారా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు. ఇప్ప‌టికే సీత పాత్ర‌కు సంబంధించిన‌ అలియా ప్రీలుక్ ను రిలీజ్ చేయ‌గా.. ఇప్పుడు ఫుల్లుగా ఆవిష్క‌రించారు రాజ‌మౌళి.

    ఈ లుక్ లో దీపాల వెలుగుల్లో మెరిసిపోతోంది అలియాభ‌ట్. అంద‌మైన‌ చీర‌క‌ట్టుతో పొందిక‌గా కూర్చొని ‘వ‌స్తాడు.. నా రాజు ఈ రోజు..’ అనే ఆలోచనలో మునిగిపోయింది. అచ్చ తెలుగు ఆడపడుచులా సంప్రదాయ బద్ధంగా ఉన్న అలియా సీత రూపం.. ముగ్ధమనోహరంగా ఉంది.

    Also Read: వీర‌మ‌ల్లు హీరోచిత విన్యాసాలు.. అశ్వ సార‌థ్యంలో చుక్క‌లేన‌ట‌!

    ఈ లుక్ తెగ వైరల్ అవుతోంది. సీత పాత్రలో అలియా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కాగా.. ప్రత్యేకంగా వేసిన సెట్లో రామ్ చరణ్ – అలియాపై స్పెషల్ సాంగ్ ను షూట్ చేయబోతున్నాడు రాజమౌళి. 1920 నాటి పరిస్థితులు కళ్లముందు కదలాడేలా సెట్ రూపొందించారట ఆర్ట్ డైరెక్టర్. మొత్తానికి సీతగా తెలుగు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటోంది అలియా.

    దాదాపు రూ.400 కోట్ల భారీ బ‌డ్జెట్ తో డివివి ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర‌వాణి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. వ‌చ్చే ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న ఈ సినిమా రిలీజ్ చేయ‌బోతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్