Homeఎంటర్టైన్మెంట్Jatadhara: జటాధర సోనాక్షి ఫస్ట్ లుక్: గూస్ బంప్స్ రేపుతున్న పవర్ఫుల్ గెటప్, సుధీర్ బాబు...

Jatadhara: జటాధర సోనాక్షి ఫస్ట్ లుక్: గూస్ బంప్స్ రేపుతున్న పవర్ఫుల్ గెటప్, సుధీర్ బాబు సినిమాపై అంచనాలు పీక్స్ !

Jatadhara: హీరో సుధీర్ బాబు జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. విభిన్నమైన సబ్జెక్టులు ఎంచుకుంటున్నారు. కానీ ఆయనకు హిట్ పడటం లేదు. కారణం తెలియదు కానీ సుధీర్ బాబు చిత్రాలపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అప్పుడెప్పుడో వచ్చిన ప్రేమకథా చిత్రం తర్వాత సుధీర్ బాబుకు హిట్ లేదు. ప్రేమకథా చిత్రం హారర్ కామెడీ జానర్లో విడుదలైంది. మంచి విజయం సాధించింది.

Also Read: ప్యారడైజ్ సినిమాకోసం అనిరుధ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవుతారు…

ఈసారి ఆయన పెద్ద సాహసానికి ఒడిగట్టాడు. భారీ బడ్జెట్ తో జటాధర మూవీ చేస్తున్నాడు. ఇది సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ అంశాలతో తెరక్కుతున్నట్లు సమాచారం. వెంకట కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. జటాధర అంటే శివుడికి మరొక పేరు. టైటిల్ తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిరేపాడు. సాంకేతికంగా ఉన్నతంగా జటధర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. సుధీర్ బాబు మార్కెట్ కి జటాధర బడ్జెట్ సాహసమే అని చెప్పాలి. సుధీర్ బాబు సైతం నిర్మాతగా ఈ చిత్రానికి ఉన్నారు.

సోనాక్షి సిన్హా తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. మొదటిసారి ఆమె జటాధరతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నేపథ్యంలో జటాధర నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సోనాక్షి లుక్ అండ్ గెటప్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. ఇంటెన్స్ తో కూడిన ఆ కళ్ళు గూస్ బంప్స్ రేపుతున్నాయి. ఫస్ట్ లుక్ చూశాక జటాధర చిత్రంలో సోనాక్షి సిన్హా పాత్రపై అంచనాలు పెరిగిపోయాయి. కథలో మేటర్ ఉందన్న భావన కలుగుతుంది.

జటాధర షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. సుధీర్ బాబు సైతం కస్టపడి ఈ సినిమా కొరకు మేకోవర్ అయ్యాడు. జటాధర తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తానని సుధీర్ బాబు నమ్ముతున్నాడు. మరోవైపు సోనాక్షి సిన్హా సైతం కెరీర్లో స్ట్రగుల్ అవుతుంది. ఒక దశలో ఆమె బరువు పెరిగి ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. ఆమె ఖాతాలో విజయాలు లేవు. దేశంలో అతిపెద్ద పరిశ్రమగా ఎదిగిన తెలుగులో మూవీ చేసేందుకు ఆమె ఆసక్తిగా ఉన్నారు. జటాధర తో హిట్ కొడతానని ఆమె నమ్మకంగా ఉన్నారు.

 

Also Read: లేడీ గెటప్ లో ఉన్న ఈ క్రేజీ హీరోని గుర్తు పట్టారా? ఏకంగా 100 కోట్ల బడ్జెట్ మూవీ చేస్తున్నాడు!

RELATED ARTICLES

Most Popular