Jani Master Wife
Jani Master Wife: స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ సంఘటన చిత్ర పరిశ్రమలో అలజడి రేపింది. ఆయన వద్ద పని చేసిన లేడీ కొరియోగ్రాఫర్ కేసు పెట్టారు. తాను మైనర్ గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. 16 ఏళ్ల ప్రాయంలో ముంబై హోటల్ లో మొదటిసారి లైంగిక దాడి జరిగింది. అవుట్ డోర్ షూట్స్, క్యారవాన్ లలో పలుమార్లు తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
జానీ మాస్టర్ భార్య అయేషా సైతం మానసికంగా, శారీరకంగా వేధించింది. మతం మార్చుకుని జానీ మాస్టర్ ని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారని.. లేడీ కొరియోగ్రాఫర్ కంప్లైంట్ లో పొందుపరిచారు. ఈ కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ రిమాండ్ అనుభవించాడు. జానీ గెలుచుకున్న నేషనల్ అవార్డును సైతం రద్దు చేశారు. జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేసిన లేడీ కొరియోగ్రాఫర్ మొదటిసారి ఓ మీడియా ఛానల్ లో, ఈ వివాదంపై స్పందించారు.
ఈ మేరకు జానీ మాస్టర్, ఆయన భార్య అయేషా/సుమలత, మేనల్లుడు సమీర్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. సమీర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని, అతన్ని అరెస్ట్ చేయాలని ఆ లేడీ కొరియోగ్రాఫర్ అన్నారు. లేడీ కొరియోగ్రాఫర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. జానీ మాస్టర్ వైఫ్ అయేషా సంచలన కామెంట్స్ చేసింది. ఢీ షో ద్వారా ఆమె జానీ మాస్టర్ కి పరిచయమైంది. ఆమె చాలా యాక్టీవ్, హార్డ్ వర్కర్.. అందుకే జానీ మాస్టర్ కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.
జానీ మాస్టర్ ని ఆమె ఇష్టపడింది. జానీ మాస్టర్ తో హద్దులు దాటి ప్రవర్తించింది. అందుకే పక్కన పెట్టాడు. ఆమెను గ్రూప్ లో చేర్చుకుని డాన్స్ యూనియన్ లో సభ్యత్వం ఇప్పించాము. ఆమె చెల్లి చదువుకు ఆర్థిక సహాయం కూడా చేశాము. జానీ మాస్టర్ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు.. కేసులు పెట్టించారని ఆమె ఫైర్ అయ్యారు.
మరోవైపు జానీ మాస్టర్ తిరిగి బిజీ అయ్యారు. ఆయన పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇటీవల నటి ఝాన్సీ.. జానీ మాస్టర్ కి వ్యతిరేకంగా కేసు తాము గెలిచామని ప్రకటించారు. ఆమె వ్యాఖ్యలకు జానీ మాస్టర్ కౌంటర్ ఇచ్చాడు.
Web Title: Jani master wifes latest comments go viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com