Dil Raju
Dil Raju: సంక్రాంతి బరిలో నిలిచిన గేమ్ ఛేంజర్ ప్రేక్షకులను నిరాశ పరిచింది. డాకు మహారాజ్ ఓ మోస్తరు విజయం అందుకోగా.. ఫార్మ్ లో లేని వెంకటేష్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఏకంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. సోలోగా వెంకటేష్ కి ఇది అతిపెద్ద విజయం. ఒకటికి మూడింత లాభాలు సంక్రాంతికి వస్తున్నాం మూవీ తెచ్చిపెట్టింది. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు దిల్ రాజు నిర్మాత కాగా… 2025 ఆయనకు మిశ్రమ ఫలితాలు ఇచ్చింది.
గేమ్ ఛేంజర్ తో పోగొట్టుకున్న డబ్బులు సంక్రాంతికి వస్తున్నాం తెచ్చిపెట్టింది. కాగా గేమ్ ఛేంజర్ ఫలితం పై దిల్ రాజు ఫస్ట్ టైం స్పందించారు. ఆ మూవీ ప్లాప్ కావడానికి కారణం ఆయన తెలియజేశారు. గత నాలుగేళ్లుగా మేము ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాము. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో మూవీ మంచి రోడ్ ఎక్కేశాము. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కాయి. అవన్నీ మేము కథలను నమ్మి, దర్శకులతో ప్రయాణం చేయడం వలన సాధ్యమైంది.
కాంబినేషన్స్ ని నమ్ముకుని సినిమాలు చేయడం వలన మాకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. గేమ్ ఛేంజర్ విషయంలో జరిగిన తప్పు అదే. ఒక సినిమాకు బడ్జెట్ ముఖ్యం కాదు. కథ, కథనాలే ముఖ్యం.. అని దిల్ రాజు అన్నారు. దిల్ రాజు మాటల ప్రకారం.. స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో, భారీ బడ్జెట్.. ఉంటే సరిపోదు. వీటి కంటే కథ ముఖ్యం. గేమ్ ఛేంజర్ కథలో విషయం లేకపోవడం వలనే నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పకనే చెప్పాడు.
ఈ మధ్య కాలంలో తమ బ్యానర్ లో విడుదలై, ప్లాప్ టాక్ తెచ్చుకున్న చిత్రాల విషయంలో కూడా ఇదే జరిగింది అన్నట్లు ఆయన కామెంట్స్ ఉన్నాయి. గత రెండేళ్లలో దిల్ రాజు నిర్మించిన శాకుంతలం, ది ఫ్యామిలీ స్టార్ నిరాశపరిచాయి. నష్టాలు తెచ్చిపెట్టాయి. కాగా గేమ్ ఛేంజర్ పై జరిగిన దుష్ప్రచారం కూడా ఫలితాన్ని దెబ్బ తీసిందనే వాదన ఉంది. సినిమా విడుదలైన గంటల వ్యవధిలో పైరసీ ప్రింట్
Web Title: Dil rajus shocking comments on ram charan and shankar
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com