https://oktelugu.com/

కరోనా.. నాలో మార్పు తీసుకు వచ్చిందంటున్న బ్యూటీ

దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ చేపట్టింది. 21రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలుతో వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ అయ్యాయి. సినిమా షూటింగ్ వాయిదాపడగా థియేటర్లను మూసివేశారు. దీంతో సినీ స్టారంతా ఇంటికే పరిమితమయ్యారు. పలువురు సెలబెట్రీలు సోషల్ మీడియాలో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలువరు సెలబెట్రీలు విరాళాలను ప్రకటిస్తూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు. కరోనాతో ఇళ్లకే పరిమితమై సెలబెట్రీలు ఖాళీ టైమును ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు సోషల్ మీడియాలో కరోనా టైంలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 2, 2020 7:11 pm
    Follow us on


    దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ చేపట్టింది. 21రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలుతో వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ అయ్యాయి. సినిమా షూటింగ్ వాయిదాపడగా థియేటర్లను మూసివేశారు. దీంతో సినీ స్టారంతా ఇంటికే పరిమితమయ్యారు. పలువురు సెలబెట్రీలు సోషల్ మీడియాలో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలువరు సెలబెట్రీలు విరాళాలను ప్రకటిస్తూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు.

    కరోనాతో ఇళ్లకే పరిమితమై సెలబెట్రీలు ఖాళీ టైమును ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు సోషల్ మీడియాలో కరోనా టైంలో వారి అప్డేట్స్ పెడుతూ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నారు. కాజల్ అగర్వాల్, నిధి అగర్వాల్ వంటింట్లో చేరి తమ పాక నైపుణ్యాన్ని ప్రదర్శించి అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. కొందరు హీరోయిన్లు ఫిట్ నెస్ పై దృష్టిపెడుతున్నారు. ఇటీవల మెగా కోడల ఉపాసన తన భర్త రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా తానే స్వయంగా కేక్ తయారుచేసి చరణ్ గిప్ట్ ఇచ్చిన సంగతి తెల్సిందే.

    తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కరోనా తనలో మార్పు తీసుకొచ్చిందని చెబుతోంది. ఖాళీగా ఉంటే తల్లి శ్రీదేవి గుర్తుకొస్తుందని వాపోయింది. అదేవిధంగా తినే ఆహారంతోపాటు ఇంట్లో వస్తువుల విలువ కూడా తనకు తెలిసొచ్చిందని చెబుతుంది. తనకు ఆహారం అవసరం ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగానని.. అయితే గత వారంరోజుల్లో ఇంట్లోకి ఏమేమి అవసరం అవుతాయో తెలుసుకున్నాని జాన్వీ పేర్కొంది.

    అదేవిధంగా ఇంట్లోని ప్రతీఒక్కరి గురించి పట్టించుకోవాలనే ఆలోచన కలిగిందని.. టైం విలువను ఇప్పుడిప్పుడే తెలుస్తుందని జాన్వీ కపూర్ అంటోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్లో జాన్వీకపూర్ ఎంట్రీ ఎవరితో ఉంటుందనేది ఆసక్తికి రేపుతోంది. తాజాగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో తీసే మూవీలో జాన్వీ నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. జాన్వీ ఈ మూవీలో నటిస్తుందో లేదా వేచి చూడాల్సిందే..
    Also Read: చిన్న ఎన్టీఆర్ తో చిన్న శ్రీదేవి