Janhvi Kapoor: దివంగత నటి, అతిలోక సుందరి ముద్దుల కూతురు, గారాల పట్టి జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ ఖాతా లో షేర్ చేస్తూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది.

గురువారం, నిర్మాత బోనీ కపూర్ 66వ ఏట అడుగుపెట్టారు. ఆయన పిల్లలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, అర్జున్ కపూర్ మరియు అన్షులా కపూర్ సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జాన్వి సోషల్ మీడియాలో రెండు చిత్రాలను పంచుకున్నారు. 66 వ పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి బోనీకి శుభాకాంక్షలు తెలిపారు.
మొదటి చిత్రంలో, బోనీ జాన్వీని ఆమె బుగ్గలపై ముద్దు పెట్టె చిత్రాన్ని షేర్ చేసుకుంది. బోనీ సోదరుడు సంజయ్ కపూర్ మరియు చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కెమెరాకు పోజులివ్వగా, “హ్యాపీ బర్త్ డే ఫాదర్!! ప్రపంచంలోని అత్యుత్తమ వ్యక్తికి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ” అని క్యాప్షన్ ఇచ్చింది. మరొక చిత్రంలో, ఖుషీ తన తండ్రిని ముద్దుపెట్టు కునే చిత్రాన్నిషేర్ చేసింది. అయితే జాన్వీ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ, “మీరు ఆమెకు ఎక్కువ శ్రద్ధ ఇచ్చినప్పటికీ” అనే కాప్షన్ జోడించింది జాన్వీ కపూర్.

“మీరు ఆమెకు ఎక్కువ శ్రద్ధ ఇచ్చినప్పటికీ” అంటూ కాప్షన్ ఇవ్వడం వెనక జాన్వీ కపూర్ తన సోదరి అయిన ఖుషి కపూర్ మీద గుర్రుగా ఉందని అర్ధమవుతుంది. ఎందుకంటే చిన్న కూతురు అని చెల్లి కే ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తున్నారని తన తండ్రి బోనీ కపూర్ ని సోషల్ మీడియా వేదికగా నిలదీసింది.
Also Read: Faria Abdhulla: శ్రీను వైట్ల సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన “చిట్టి”