Faria Abdhulla: జాతి రత్నాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యారు ఫరియా అబ్దుల్లా.మొదటి సినిమా అయినా ఈ హీరో తో పాటు ప్రేక్షకులలో గుర్తింపు పొందింది అయితే ఫరియా అబ్దుల్లా కన్నా చిట్టి అంటే ప్రేక్షకులు బాగా గుర్తు పట్టగలరు ఎందుకంటే చిట్టి గా ఆ పాత్రకు తనదైన శైలిలో నవ్వులు పూయించింది ఈ భామ. జాతి రత్నాలు సినిమా తర్వాత వరసగా సినిమాలతో బిజీ అయిపోతుంది అనుకున్నారు. అయితే మాస్ మహారాజా రవితేజతో సినిమా చేసిందని రూమ్స్ కూడా వచ్చాయి. కానీ అవన్నీ నిజం కాదని తేలిపోయింది. అక్కినేని అఖిల్ సినిమా అయినా మోస్ట్ “ఎలిజిబుల్ బ్యాచిలర్” చిన్న పాత్రలో నటించింది ఈ అమ్మడు.

ప్రస్తుతం మంచు విష్ణు దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “డి అండ్ డి “ఈ చిత్రంలో విష్ణు సరసన ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ ,ఈ విషయాన్ని అధికారకంగా శ్రీను వైట్ల ప్రకటించారు. శ్రీను వైట్ల విష్ణు కాంబోలో తెరకెక్కిన ” డి” మూవీ సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే, ” డి ” సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా “డి అండ్ డి ” ఈ మూవీ ” డీ “లాంటి విజయాన్ని ఈ చిత్రం అందుకుంటుందో లేదో చూడాలి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ మొదలవుతుందని తెలియజేశారు.