Thaman: ఇటీవల కాలంలో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుని.. ఫుల్ బిజీగా గడుపుతున్న మ్యూజిక్ డైరక్టర్లలో థమన్ ఒకరు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు అందిస్తుండటం విశేషం. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు నెట్టింట మంచి ఆదరణ లభించింది.
His idea of using his cute chair into a 🥁 drumming tool .. jus remembering by childhood days ❤️💥🧨🥁🥁🥁 #BheemlaNayakTitleSong 🎵💪🏼⚡️ teach him good music 🎵 https://t.co/pUz9Uw8qDt
— thaman S (@MusicThaman) November 11, 2021
మరోవైపు, ఇటీవల విడుదలైన లాలా భీమ్లా పాట సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటే ట్రెండింగ్‌లో వినిపిస్తోంది. కాగా, సోషల్ మీడియాలో ఓ చిన్న పిల్లాడు స్టూల్‌తో భీమ్లా నాయక్ పాటకు డ్రమ్స్ వాయించినట్లు కనిపించాడు. ఈ వీడియోపై థమన్ స్పందించారు. ఆ పిల్లాడి ప్రదర్శన.. తన చిన్ననాది రోజులను గుర్తు చేసిందని అన్నారు.
మరోవైపు, సర్కారు వారి పాటకు కూడా స్వరాలు అందిస్తున్నారు. ఇందులో మహేశ్‌బాబు హీరోగా కనిపించనున్నారు. దీంతో పాటు, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటిస్తోన్న గని, అఖిల్ హీరోగా రానున్న ఏజెంట్ సినిమాలకూ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్1న సర్కారు వారి పాట విడుదలవుతోంది. భీమ్లా నాయక్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.