Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి కూతురిగా జాహ్నవి కపూర్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సౌత్ సినిమా ఇండస్ట్రీ మీద తన దృష్టి పెట్టింది. తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమా ప్రేక్షకులకు హీరోయిన్ జాహ్నవి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ధడక్ అనే సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకని బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. హిందీలో విభిన్న కథలో ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. రీసెంట్గా జాన్వి కపూర్ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా హీరోయిన్గా పరిచయం అయింది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన దేవర సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో జాన్వి కపూర్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం జాహ్నవి కపూర్ రామ్ చరణ్ కు జోడిగా పెద్ది సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో జాన్వి పక్క పల్లెటూరి అమ్మాయిల కనిపించబోతుంది అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
Also Read: యూట్యూబర్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కమెడియన్..
తాజాగా ఈమెకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. జాన్వి కపూర్ చిన్నమ్మ అంటే పిన్ని సైతం తెలుగులో ఒకప్పటి స్టార్ హీరోయిన్. ఒకప్పుడు ఈమె అగ్ర కథానాయకదా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపింది. ఈమె మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ మహేశ్వరి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ మహేశ్వరి శ్రీదేవికి చెల్లెలు అవుతుంది. మహేశ్వరి శ్రీదేవి కజిన్. జెడి చక్రవర్తి హీరోగా నటించిన గులాబీ సినిమాతో హీరోయిన్గా మహేశ్వరి బాగా ఫేమస్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత మహేశ్వరికి తెలుగులో అవకాశాలు వరుసగా వచ్చాయి.
వడ్డే నవీన్ నటించిన పెళ్లి సినిమాతో మహేశ్వరి మరొక సూపర్ హిట్ అందుకుంది. ఇప్పటికీ కూడా పెళ్లి సినిమాలోని పాటలను ప్రేక్షకులు ఎంతో ఇష్టపడతారు. తెలుగు తో పాటు మహేశ్వరి తమిళ్లో కూడా వరుస సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. భారతి రాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం సినిమా ద్వారా మహేశ్వరి 1994లో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ ఇచ్చింది. ఆ తర్వాత గులాబీ సినిమాతో ఈమెకు ఫుల్ క్రేజ్ వచ్చింది. తెలుగులో మహేశ్వరి జగపతిబాబు, రవితేజ, జె.డి చక్రవర్తి వంటి హీరోలతో జోడిగా నటించి మెప్పించింది. సినిమాలతో పాటు సీరియల్లలో కూడా నటించి ప్రేక్షకులను ఇప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తుందని సమాచారం.