
అతిలోకసుందరి అనే పదం ఒక్క శ్రీదేవికి మాత్రమే చెందినది. శ్రీదేవి.. భారతీయ సినీ ప్రపంచంలో ధృవ తారగా వెలుగులు జిమ్మిన అందాల
జాబిల్లి. ఆమె రూపం మగ మనసులకు ఎంతో ఉల్లాసం, ఆమె అందం ఆడగాలికే పెద్ద అసూయ. అందుకే ప్రతి ఏటా ఎంతమంది ప్రపంచ సుందరిమణులు వచ్చినా శ్రీదేవి అందానికి సరితూగరు. పైగా తెలుగు, తమిళ సినిమాలతోనే సినీ ప్రపంచాన్ని ఏలిన అందగత్తె. అలాగే హిందీ సినిమాని శాసించిన ఘనత కూడా శ్రీదేవికే దక్కుతుంది.
ఇక ఈ అతిలోకసుందరికి ఒక హాబీ ఉండేదని ఆమె సన్నిహితులు అందరికీ తెలుసు. అదే ఆర్ట్ పెయింటింగ్ వేయడం, శ్రీదేవికి పెయింటింగ్ వేయడం రోజూ అలవాటు. తనకిష్టమైన పని కూడా పెయింటింగే అని చెబుతూ ఉంటారు. మరి తల్లికి ఇష్టం అని పెయింటింగ్ నేర్చుకుందో.. లేక తల్లి నుండి వచ్చిన పోలికలు కారణంగా పెయింటింగ్ వేయడం వచ్చిందో తెలియదు గానీ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా అదే బాటలో నడుస్తోంది ఇప్పుడు. జాన్వీ కపూర్ కూడా సూపర్ గా బొమ్మలు గీస్తూ తల్లికి తగ్గ తనయ అనిపించుకుంది.
కాగా తాజాగా తన చిత్రలేఖన ప్రతిభని జాన్వీ కపూర్ బయట పెడుతూ.. తాను పెయింటింగ్ వేసిన, వేస్తున్న ఆర్ట్ బొమ్మలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ప్రేక్షకులతో పంచుకుంది. మరి ఈ అందాల బొమ్మ జాన్వీ కపూర్ వేసిన అందమైన బొమ్మలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఒక లుక్కేయండి. ఇక, జాన్వీని తెలుగులో నటింప చెయ్యాలని బోణీ కపూర్ చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తోన్న సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నే అనుకుంటున్నారని తెలుస్తోంది.