Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan: 'జన నాయగన్' విషయం లో ఊహించని ట్విస్ట్..విడుదల మరింత ఆలస్యం..పాపం నిర్మాత!

Jana Nayagan: ‘జన నాయగన్’ విషయం లో ఊహించని ట్విస్ట్..విడుదల మరింత ఆలస్యం..పాపం నిర్మాత!

Jana Nayagan: తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) నటించిన ‘జన నాయగన్'(Jana Nayagan Movie) చిత్రానికి ఇప్పట్లో మోక్షం కలిగేలా లేదు. అదేంటి రీసెంట్ గానే నిర్మాతలు కోర్టు లో పెట్టిన పిటీషన్ ని వెనక్కి తీసుకున్నారు కదా?, సెన్సార్ సభ్యులు చెప్పినట్టుగా 20 నిమిషాల సన్నివేశాన్ని కూడా తొలగిస్తామని చెప్పారు కదా?, మరి సమస్య ఏంటి?, ఎందుకు ఈ చిత్రం విడుదల ఇప్పట్లో కష్టమని అంటున్నారు అని మీరంతా అనుకోవచ్చు. అక్కడికే వస్తున్నాం, ఈ చిత్రాన్ని కెనడా దేశం లో డిస్ట్రిబ్యూట్ చేసిన ‘యార్క్ సినిమాస్’ సంస్థ, నేడు ఒక లేఖని విడుదల చేసింది. ఈ లేఖలో”జన నాయగన్’ చిత్రం ‘ఏప్రిల్ 30′ వరకు విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు కాబట్టి, జనవరి 8న ఈ సినిమా ప్రీమియర్ షోస్ టికెట్స్ కొనుగోలు చేసిన వాళ్లకు, ఇంకా మీ డబ్బు తిరిగి రానట్టు అయితే, దగ్గర్లో ఉన్న యార్క్ సినిమాస్ ని సంప్రదించండి. మీ డబ్బులు మీకు తిరిగొస్తాయి’ అంటూ చెప్పుకొచ్చింది.

ఈలోపు విడుదల తేదీ ఖరారు అయితే, అప్పటి ప్రయారిటీ ని బట్టీ ఈ సినిమాకు సంబంధించిన షోస్ ని మరోసారి షెడ్యూల్ చేస్తాము. అప్పుడు టికెట్స్ బుక్ చేసుకోండి అంటూ చెప్పుకొచ్చారు. దీనిని బట్టీ అర్థం అవుతున్న విషయం ఏమిటంటే నిర్మాతల నుండి ‘యార్క్ సినిమాస్’ కి ఈ చిత్రం ఏప్రిల్ 30 వరకు విడుదలయ్యే అవకాశం లేదు అనే సమాచారం వెళ్లినట్టు ఉందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంటే తమిళనాడు లో ఎన్నికలు పూర్తి అయినా తర్వాత ఈ సినిమా విడుదలకు మోక్షం లభిస్తుంది. అప్పటి వరకు విజయ్ ఫ్యాన్స్ ఎదురు చూడక తప్పదు. అయితే 20 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలే కదా, తొలగించి సెన్సార్ కి పంపడం ఎంత సేపు పని అని మీరంతా అనుకోవచ్చు.

కానీ ఆ 20 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలతో లింకైనా సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అకస్మాత్తుగా ఇలా తొలగించేస్తే, చూసే ప్రేక్షకుడికి అసలు ఏమి జరుగుతుందో అర్థం అవ్వక తికమక కి గురయ్యే ప్రమాదం ఉంది. చాలా చాకచక్యంగా ఎడిటింగ్ చెయ్యాలి. అవసరమైతే కొన్ని సన్నివేశాలను షూట్ చేసి మధ్యలో ఇరికించాలి, ఇలా చాలా తతంగం ఉంది. అవన్నీ జరిగిన తర్వాతే సెన్సార్ కి పంపుతారు. విజయ్ కూడా రీ షూటింగ్ కి కొంత డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయన ఫుల్ బిజీ కాబట్టి, ఎన్నికలు పూర్తి అయ్యాకే అది సాధ్యం అవుతుందని అంటున్నారు. చూడాలి మరి, కనీసం ఈ సినిమా అప్పటికైనా విడుదల అవుతుందా లేదా అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular