Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan Movie Leak: సోషల్ మీడియా లో లీకైన 'జన నాయగన్' పూర్తి మూవీ.....

Jana Nayagan Movie Leak: సోషల్ మీడియా లో లీకైన ‘జన నాయగన్’ పూర్తి మూవీ.. పాపం నిర్మాత పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..

Jana Nayagan Movie Leak: ‘జన నాయగన్'(Jana Nayagan Movie) చిత్ర నిర్మాత వెంకట్ నారాయణ పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు. బడా సూపర్ స్టార్స్ తో వరుసగా సినిమాలు చేసాడు. కానీ అవి విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. విజయ్(Thalapathy Vijay) ‘జన నాయగన్’ చిత్రానికి మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఎందుకంటే ఇదే విజయ్ చివరి చిత్రం కాబట్టి. అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల చేసుంటే మొదటి రోజే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి ఉండేది. టాక్ తో సంబంధం లేకుండా, ఫుల్ రన్ లో 300 నుండి 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేది. కానీ అలా జరగలేదు. చివరి నిమిషం లో సెన్సార్ సభ్యులు సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ సినిమా వాయిదా పడింది. జనవరి 9 న విడుదల ప్లాన్ చేసినప్పుడు , విడుదలకు రెండు రోజుల ముందు ఈ చిత్రానికి 60 కోట్ల రూపాయిల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.

ఒక్కసారి విడుదల వాయిదా పడడంతో , ఇప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేసినా ఓపెనింగ్ 60 కోట్లు వచ్చేలా అనిపించడం లేదు. పైగా నిర్మాతకు ఉన్నటువంటి కష్టాలు సరిపోవు అన్నట్టు, ఈ చిత్రం మొత్తం HD క్వాలిటీ తో సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. ట్విట్టర్ , ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి యాప్స్ లో ఈ చిత్రం సన్నివేశాలు ఒక రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇలా విడుదలకు ముందు సినిమా మొత్తం లీక్ అవ్వడం గతంలో పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి జరిగింది. అయినప్పటికీ ఈ సినిమా ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేవు.

పైగా లీకైన సన్నివేశాలను చూస్తుంటే బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని డిట్టో దింపేసినట్టుగా అనిపిస్తోంది. పాన్ ఇండియా యుగం లో ఇలాంటి రీమేక్ సినిమాలు వర్కౌట్ అవ్వవు అనేది మన అందరికీ తెలిసిందే. కానీ విజయ్ కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ , క్రేజ్ కారణంగా , ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రావొచ్చు. పైగా ఇది ఆయన చివరి చిత్రమని పదే పదే చెప్పాడు కూడా. కాబట్టి మొదటి రోజుకు ఎలాంటి డోకా లేదు. నెగెటివ్ టాక్ రాకుంటే వీకెండ్ వరకు కూడా ఈ చిత్రం బాగానే ఆడొచ్చు. కానీ వీకెండ్ దాటి మంచి వసూళ్లను రాబట్టడం దాదాపుగా అసాధ్యం అనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టీ చూస్తే ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 200 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు రావొచ్చు. చూడాలి మరి అలాంటి పరిస్థితులు ఈ సినిమాకు ఏర్పడుతాయా లేవా అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular