Jana Gana Mana Crossed RRR: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో #RRR సినిమా సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా ఆ అంచనాలకు మించి సెన్సషనల్ హిట్ అవ్వడం నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..థియేటర్స్ లో ఈ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో OTT లో అంతకు మించి విజయం సాధించింది..థియేట్రికల్ రిలీజ్ తో కేవలం ఇండియన్ సినీ ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అయినా #RRR , OTT లో విడుదల అయిన తర్వాత ఇతర దేశాల్లో ఉన్న ప్రేక్షకులు కూడా ఎగబడి చూసారు..నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా దాదాపుగా 63 దేశాల్లో ట్రెండింగ్ అవుతుంది అంటే మాములు విషయం కాదు..అలాంటి సినిమాకి పోటీ గా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఒక్క మలయాళం సినిమా వచ్చింది..ఆ సినిమా పేరే జన గణ మన..అన్ని ప్రాంతీయ బాషలలో విడుదల అయిన ఈ సినిమాకి రోజు రోజుకి ప్రేక్షకాదరణ పెరుగుతూ పోతుంది..మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ హీరో గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో అద్భుతంగా రన్ అయిన తర్వాత ఇటీవలే ఆ చిత్ర బృందం OTT లో విడుదల చేసారు.

Also Read: Grand Mosque in Makkah: మక్కామసీదులో అద్భుతం.. ప్రపంచంలోనే ఇదో అతిపెద్ద కూలింగ్ సిస్టం
సమాజం లో చోటు చేసుకున్న కొన్ని నిజమైన సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలా తీసాడు ఆ చిత్ర దర్శకుడు డిజో జోస్ ఆంటోనీ..ముఖ్యంగా ఈ సినిమా సెకండ్ హాఫ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కపొడుచుకునే రేంజ్ లో ఉంటుంది..ప్రస్తుతం ఈ సినిమా ఇండియా నెట్ ఫ్లిక్స్ లో #RRR సినిమాని వెనక్కి నెట్టి నెంబర్ స్థానం లో ట్రెండ్ అవుతుంది..ఇది మలయాళం సినిమా ఇండస్ట్రీ కి ఒక్క రేర్ ఫీట్ అని చెప్పొచ్చు..ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ కూడా ఇటీవల విడుదల అయిన మలయాళం సినిమాలు అన్నిటికంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది..ప్రపంచవ్యాప్తంగా కేవలం మలయాళం బాషలోనే విడుదల అయిన ఈ సినిమాకి దాదాపుగా 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది..మలయాళం లో మాత్రమే కాకుండా ఈ సినిమాని అన్ని ప్రాంతీయ బాషలలో విడుదల చేసి ఉంటె ఇంకా భారీ వసూళ్లను కొల్లగొట్టేది అని ట్రేడ్ పండితుల అభిప్రాయం..అయితే మంచి సినిమాలను రీమేక్ చెయ్యడం లో ఎప్పుడు ముందు ఉండే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఈ మూవీ ని ఎవరైనా రీమేక్ చేస్తారో లేదో చూడాలి..ఇలాంటి సినిమాలకు భారీ రీచ్ రావడం తప్పనిసరి.
Also Read: Chiranjeevi: షాకింగ్.. షూటింగ్ లో ఉన్న రెండు సినిమాలను ఆపేసిన చిరంజీవి
Recommended Videos: