Ramanaidu Birth Anniversary: భారత చలన చిత్ర చరిత్రలో నిర్మాత దగ్గుబాటి రామనాయుడిది అరుదైన అధ్యాయం. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. ప్రేక్షకులకు అందించిన చిత్రాలు అజరామరం. మూవీ మొఘల్ అనే బిరుదును ఆయన పరిపూర్ణం చేసుకున్నారు. రామానాయుడు చివరి శ్వాస వరకు సినిమానే జీవితంగా బ్రతికారు. చరిత్రలో తన పేరున కొన్ని పేజీలు లిఖించుకున్నారు.

ప్రకాశం జిల్లా కారంచేడు అనే గ్రామంలో 1936 జూన్ 6న జన్మించిన. ఆర్థికంగా బలమైన నేపథ్యం కలిగిన రామానాయుడిని ఓ సంఘటన సినిమా వైపు నడిపించింది. ఏఎన్ఆర్ హీరోగా ‘నమ్మిన బంటు’ మూవీ చిత్రీకరణ కారంచేడులో జరిగింది. ఆ చిత్ర నిర్మాత వెంకన్న చౌదరి రామానాయుడికి సమీప బంధువు. కారంచేడులో నమ్మిన బంటు చిత్రీకరణ జరిగినంత కాలం యువకుడైన రామానాయుడు యూనిట్ సభ్యులకు, ఆహారం, విడిది ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొన్నాడు. ఇది గమనించిన యూనిట్ సభ్యులు మీరు కూడా సినిమాల్లోకి రావచ్చు కదా అని సలహా ఇచ్చారు.
Also Read: Grand Mosque in Makkah: మక్కామసీదులో అద్భుతం.. ప్రపంచంలోనే ఇదో అతిపెద్ద కూలింగ్ సిస్టం
నటుడిగా కంటే రామానాయుడు నిర్మాతగా విజయం సాధించాలని అనుకున్నాడు. అనురాగం చిత్రానికి రామానాయుడు స్లీపింగ్ పార్టనర్ గా వ్యవహరించారు. అనంతరం కొడుకు సురేష్ బాబు పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి మొదటి చిత్రంగా ఎన్టీఆర్ తో ”రాముడు-భీముడు” చేశారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. నిర్మాతగా రామానాయుడు తొలి ప్రయత్నం ఫలించింది.

అయితే తర్వాత సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. రామానాయుడు ఆర్ధికంగా చితికిపోయారు. తిరిగి ఇంటికి పోయి వ్యవసాయం చేసుకోవాలా? లేక నిర్మాతగానే కొనసాగాలనే సందిగ్ధంలో పడ్డారు. పోయిన చోటే వెతుక్కోవాలని, భార్య పుస్తెలు కూడా అమ్మి ఏఎన్ఆర్ తో ప్రేమ నగర్ చిత్రాన్ని నిర్మించారు. డైరెక్టర్ కే. ప్రకాష్ రావు తెరకెక్కించిన ప్రేమ నగర్ అప్పట్లో ఓ సెన్సేషన్. ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ చిత్రం రామానాయుడుకి లక్షల లాభాలు తెచ్చిపెట్టింది.
అక్కడి నుండి రామానాయుడు వెనుదిరిగి చూసుకోలేదు. సురేష్ ప్రొడక్షన్స్ ప్రస్థానం దశాబ్దాలు సాగింది, సాగుతుంది. ఈ సంస్థ నుండి సినిమా అంటే బాగుంటుంది అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఏకంగా 12 భాషల్లో వందకు పైగా చిత్రాలు సురేష్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కాయి. నిర్మాతగా రామనాయుడు ఎవరికీ అందనంత ఎత్తుకు చేరారు. అనేక అంతర్జాతీయ, జాతీయ గౌరవాలు పొందారు. 2009లో దాదాసాహెబ్ పాల్కే, 2012లో పద్మ భూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డ్స్ అందుకున్నారు.

రాజకీయంగా కూడా రామనాయకుడు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ తరఫున బాపట్ల పార్లమెంట్ నుండి గెలుపొంది ఎంపీ అయ్యారు. ఈ సమయంలో తాను పుట్టిన ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. 2015 ఫిబ్రవరి 18న రామానాయుడు 78ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన వారసులుగా వెంకటేష్, సురేష్ బాబు, రానా దగ్గుబాటి, నాగ చైతన్య పరిశ్రమకు నటులుగా, నిర్మాతలుగా సేవలు అందిస్తున్నారు.
Also Read:Mahesh Babu: మహేష్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆ ప్రాంతం లో మేజర్ కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం