Jalsa Re Release Advance Bookings: ఈ ఏడాది ముగింపు లో టాలీవుడ్ లో ఎప్పుడూ జరగని అరుదైన సంఘటన ఒక జరిగింది. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) , మహేష్ బాబు(Superstar Mahesh Babu) సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఎలా ఉంటుంది?, ఎవరు గెలుస్తారు అని అప్పట్లో డిబేట్స్ నడిపేవారు. ఇన్నేళ్ళుగా అలాంటి సందర్భం ఇప్పటి వరకు రాలేదు కానీ, వీళ్లిద్దరి కెరీర్ లో మైల్ స్టోన్స్ గా నిల్చిన చిత్రాలు ‘జల్సా'(#Jalsa4k), ‘మురారి'(#Murari4k) ఒకే రోజున విడుదల అవుతూ పెద్ద చర్చ కి దారి తీసింది. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు గతంలో రీ రిలీజ్ అయ్యి టాలీవుడ్ రీ రిలీజ్ చిత్రాల్లో ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పాయి. మళ్లీ ఇప్పుడు రెండవసారి రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో ఏది పై చేయి సాధించబోతుంది?, ఏ చిత్రానికి ఎక్కువ గ్రాస్ రాబోతుంది అనే విషయం పై ఆడియన్స్ లో చాలా ఆసక్తి ఉండేది.
ఆ ఆసక్తి కి ఇక తెరపడింది. పవన్ కళ్యాణ్ ‘జల్సా’ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘మురారి’ చిత్రం పై తిరుగులేని ఆధిపత్యాన్ని కోణగించింది. జల్సా చిత్రానికి కేవలం హైదరాబాద్ సిటీ నుండి 31 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బూకంగ్స్ ద్వారా రాబడితే, మురారి చిత్రానికి ఇండియా వైడ్ గా కలిపి 23 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ డామినేషన్ నడుస్తుంది చెప్పడానికి. ఇండియా వైడ్ గా జల్సా చిత్రానికి అక్షరాలా 54 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. ‘మురారి’ చిత్రానికి మంచి గ్రాస్ వసూళ్లు రావడం కోసం కేవలం 99 రూపాయిల టికెట్ రేట్ కి , అది కూడా కేవలం ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ కి ప్లాన్ చేశారు. కానీ ఎందుకో ఆడియన్స్ ఈసారి మాత్రం ఆదరించలేదు.
న్యూ ఇయర్ రోజున ఇలాంటి కుటుంబ కథా చిత్రాన్ని రిలీజ్ చేయడం మిస్టేక్ అయ్యింది. ఆడియన్స్ ఇలాంటి సమయాల్లో జల్సా లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని ఎంజాయ్ చేసేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని, మహేష్ బాబు అభిమానులు దీనికి బదులుగా పోకిరి ని ఎంచుకొని ఉండుంటే బాగుండేది అని అంటున్నారు. ఇకపోతే జల్సా చిత్రానికి మంచి డిమాండ్ ఉండడం తో నేడు కూడా షోస్ అత్యధికంగా షెడ్యూల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో పలు చోట్ల షోస్ షెడ్యూల్ అవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి, ఫుల్ రన్ ముగిసిన తర్వాత ఏ చిత్రానికి ఎక్కువ వసూళ్లు వస్తాయో చూద్దాం.