Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ ‘సలార్’ ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అని మాత్రమే ఎందుకు అన్నానంటే ఈ పాన్ ఇండియా స్టార్ నుంచి వచ్చిన గత రెండు సినిమాలు కూడా ఫ్యాన్స్ కోరుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ప్రతి సినిమా ఈజీగా 300 కోట్లు వసూళ్లు చేస్తుంది కాబట్టి వాటిని ప్లాప్ అని అనకూడదు కానీ ప్రభాస్ స్టామినా కి తగ్గ హిట్లు కాదనే చెప్పాలి. అందుకే ఆయన ఫ్యాన్స్ సలార్ కోసం చూస్తున్నారు.
KGF సిరీస్ తో బాక్స్ ఆఫీస్ భరతం పట్టిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం పైగా చాలా రోజుల తర్వాత ఫుల్ ప్యాకెడ్ పవర్ఫుల్ రోల్ లో ప్రభాస్ కనిపించటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. సెప్టెంబర్ 28 న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాపై కొందరు అప్పుడే నెగిటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారు.
ఈ సినిమా రన్ టైం దాదాపు 180 నిమిషాలు అంటే 3 గంటలు ఉంది. అంత లెంగ్త్ అయితే ఏమైనా తేడా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయంటూ మాట్లాడుతున్నారు. రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ కూడా 2 గంటల 59 నిమిషాలు రన్ టైం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. పైగా ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక రన్ టైం ఉన్న సినిమాల్లో సలార్ ఒకటి అయ్యే అవకాశం లేకపోలేదు.
బాహుబలి 1, బాహుబలి 2 లాంటి సినిమాలే 2 గంటల 38 నిముషాలు, 2 గంటల 47 నిముషాలు ఉన్నాయి. వాటికి భిన్నంగా సలార్ మూడు గంటలు ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్. హీరోని ఎలా చూపించాలో మాస్ పల్స్ తెలిసిన వ్యక్తి. లెంగ్త్ ఎంత ఉన్న గాని ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగే సత్తా ఉన్నవాడు. యష్ లాంటి హీరోను ఎలా చూపించాడో మనకు తెలుసు. ఇక ప్రభాస్ లాంటి డైనమేట్ దొరికితే ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించండి. కాబట్టి రన్ టైం ఎక్కువగా ఉంది అనే నెగిటివ్ టాక్ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.