Jailer Collections: సూపర్ స్టార్ అనే ట్యాగ్ కు ఉన్న పవర్ ఏమిటో దానికి ఉన్న స్థాయి ఏమిటో తాజాగా మరోసారి రుజువు అయ్యింది. సరైన హిట్ కొట్టి దాదాపు దశాబ్దం దాటినా కానీ ఎక్కడ కూడా ఇమేజ్ తగ్గకుండా ఉండటమే కాకుండా సరైన హిట్ బొమ్మ పడితే బాక్సాఫీస్ ని ఎలా షేక్ చేయాలో బాగా తెలిసిన వాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన నుండి వచ్చిన జైలర్ మూవీ వరల్డ్ వైడ్ గా వసూళ్ల సునామీ సృష్టిస్తుంది.
దాదాపు 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన జైలర్ మూవీ రిలీజ్ అయిన ప్రతి చోట వసూళ్ల ఊచకోత కోస్తుంది. దాదాపు 3000 వేల స్క్రీన్ లో రిలీజ్ అయిన జైలర్ తొలిరోజే ఇండియాలో 55 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇక రెండో రోజు కలెక్షన్స్… ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. ఇక మూడో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్రను కొనసాగించింది.
మూడో రోజు కూడా అదే స్థాయి వసూళ్లు సాధించి కేవలం మూడు రోజుల్లోనే రూ. 214.15 కోట్లు గ్రాస్, రూ. 105.10 కోట్లు షేర్ వచ్చింది. ఇదే ఊపులో నాలుగో రోజు కూడా భారీ వసూళ్లు సాధించింది జైలర్ మూవీ దాదాపు 40 కోట్లు వసూళ్లు సాధించింది. దీనితో కేవలం నాలుగు రోజుల్లోనే 260 కోట్లు వసూళ్లు కొల్లగొట్టింది. కేవలం ఇండియా లోనే 140 కోట్లు నెట్ వసూళ్లు చేసింది జైలర్.
ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యి ఓవర్ ఫ్లో కూడా స్టార్ట్ అయ్యింది జైలర్ మూవీకి. దీనితో సినిమాను కొన్న వాళ్ళు కేవలం నాలుగు రోజుల్లోనే లాభాల బాట పట్టారు. ఓవర్శిస్ లో దాదాపు 100 కోట్లు వసూళ్లు మార్క్ క్రాస్ అయ్యింది జైలర్. ఇక తెలుగులో ఈ సినిమాకు తిరుగులేకుండా పోయింది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ అనుకున్న విజయం సాధించక పోవటంతో జైలర్ హవా ఇంకా పెరిగింది. భోళా శంకర్ స్క్రీన్ తగ్గించి మరి జైలర్ స్క్రీన్ పెంచారు. ఇదే ఊపు చూస్తుంటే త్వరలోనే 500 కోట్ల మార్క్ క్రాస్ అయ్యే అవకాశం లేకపోలేదు.