Jailer Censor Review: సౌత్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటేస్ట్ మూవీ ‘జైలర్’. హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా రజనీ వరుసబెట్టి సినిమాలను తీస్తున్నాడు. తాజాగా జైలర్ తో రాబోతున్నాడు. సూపర్ స్టార్ కు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా రజనీకి బ్లాక్ బస్టర్ హిట్టు లేదు. రోబో సినిమా తరువాత వచ్చిన సినిమాలన్నీ యావరేజ్ హిట్టు కొడుతున్నాయి. కమర్షయల్ గా ఓకే గానీ.. ప్రేక్షకాధరణ పొందడం ముఖ్యమేనని అంటున్నారు. ఈ తరుణంలో రజనీ సినిమా ‘జైలర్’ను లేటేస్టుగా సెన్సార్ బోర్డు చూసింది. ఈ సినిమా గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది.
సాధారణంగానే రజనీ మూవీ అంటే ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆయన వయసుతో సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తున్నారు. స్టైలిష్ కు మారుపేరు అయిన రజనీ కోసమైనా ఫ్యాన్స్ థియేటర్లకు వస్తుంటారు. దీంతో ఆయన లేటేస్టు మూవీలోనూ రజనీ కొత్త లుక్ లో కనిపించే అవకాశం ఉంది. రజనీకి జోడిగా తమన్నా నటిస్తోంది. వీరిద్దరి మధ్య మేకింగ్ చేసిన ఓ సాంగ్ ఇప్పటికే హల్ చల్ చేస్తోంది.
తాజాగా ఈ మూవీపై సెన్సార్ బోర్డు కీలక కామెంట్స్ చేసింది. కమర్షియల్ గా ఈ సినిమా మెప్పించే అవకాశం ఉందని తెలిపింది. 2 గంటల 49 నిమిషాలు ఉన్న ఈ మూవీ యాక్షన్, థ్రిల్ ఇస్తుందని అంది. రజనీ మారోసారి రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమన్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఫస్ట్ రోజే సినిమా కథ అల్లుకుంటుందని.. మొత్తానికి బొమ్మ అదుర్స్ అంటూ చెప్పింది. ఇందులో రజనీ అచ్చం వింటేస్ రజనీకాంత్ చూసిన అనుభూతి కలుగుతుందని పేర్కొంది.
సన్ పిక్చర్స్ పై వస్తున్న ‘జైలర్’ ను ఆగష్టు 10న రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో రజనీకాంత్ కు జోడిగా తమన్నా నటించగా.. రమ్యకృష్ణ కూడా పోషిస్తున్నారు. అలాగే మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లతో పాటు జాకీ ష్రాఫ్ నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతంతో అలరించనున్నారు. సినిమా టో గ్రఫీగా వవిజయ్ కార్తీక్ కన్నన్ పనిచేశారు.