Jailer 2 Update: సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) కెరీర్ ని కీలక మలుపు తిప్పిన చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘జైలర్ 2′(Jailer 2 Movie) పై అభిమానుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఒక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా బయటకు రాలేదు. కానీ సినిమా మీద క్రేజ్ మాత్రం వేరే లెవెల్ లో ఉంది. సీక్వెల్స్ కి మొదటి నుండి ఇలాంటి రేంజ్ ఉండడం సహజమే, పైగా సూపర్ స్టార్ రజినీకాంత్ అందులో హీరో అంటే ఆ మాత్రం ఉండడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇకపోతే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి నటిస్తున్నాడు.
ఆయనకు కూతురు గా నేషనల్ అవార్డు విన్నర్ విద్యాబాలన్ నటిస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ కోసం మన నందమూరి బాలకృష్ణ ని మేకర్స్ సంప్రదించిన విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఆయన ఎందుకో ఈ చిత్రం లో నటించడానికి సుముఖత చూపించలేదు. అయితే ఇప్పుడు ఈ క్యారక్టర్ ని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్(Shahrukh Khan) చేయబోతున్నాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. రజినీకాంత్, షారుఖ్ ఖాన్ కి మధ్య మొదటి నుండి మంచి సాన్నిహిత్యం ఉంది. షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ మూవీ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ చిత్రం లో రజినీకాంత్ ని పొగుడుతూ చేసిన ‘లుంగీ డ్యాన్స్ సాంగ్ ‘ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే విధంగా షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘రావన్’ చిత్రం లో రజినీకాంత్ అతిధి పాత్రలో కనిపించాడు.
ఇప్పుడు రజినీకాంత్ స్వయంగా తన సినిమాలో ఈ కీలక పాత్ర పోషించమని రిక్వెస్ట్ చేయడం తో షారుఖ్ ఖాన్ క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ జరగనుంది అట. ఈ పాత్ర నిడివి దాదాపుగా 15 నిమిషాల వరకు ఉంటుందని సమాచారం. మొదటి భాగం లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్స్ అతిధి పాత్రల్లో కనిపించారు. రెండవ భాగం లో కూడా వాళ్ళ పాత్రలు ఉంటాయట. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.