Jailer 2 : అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఇక పూర్తిగా హీరో పాత్రలకు దూరం కానున్నాడా..?, తన సెకండ్ ఇన్నింగ్స్ ని కేవలం క్యారక్టర్ రోల్స్ కి పరిమితం చేయనున్నాడా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఆయన నటించిన రెండు సినిమాల్లోనూ క్యారక్టర్ రోల్స్ చేసాడు. ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth), లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కూలీ'(Coolie Movie) చిత్రం కాగా, మరొకటి శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కుబేర’ చిత్రం. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాయి. ఒకటి జూన్ నెలలో విడుదల కాబోతుంటే, మరొకటి ఆగష్టు నెలలో విడుదల కాబోతుంది. ఈ రెండిట్లో ‘కూలీ’ చిత్రం పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఈ చిత్రం లో నాగార్జున క్యారక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో ఆయన విలన్ క్యారక్టర్ చేసినట్టు తెలుస్తుంది.
ఇక ‘కుబేర’ విషయానికి వస్తే రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున క్యారక్టర్ ఏమిటి అనే దానిపై క్లారిటీ రాలేదు కానీ, ఇందులో కూడా ఆయన డిఫరెంట్ పాత్రలోనే కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన రజినీకాంత్ ‘జైలర్ 2′(Jailer 2 Movie) లో కూడా మెయిన్ విలన్ రోల్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మేకర్స్ నాగార్జున తో సంప్రదింపులు జరుపుతున్నారట. కేవలం ఆయన అంగీకారం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. సాధ్యమైనంత వరకు నాగార్జున ఈ క్యారక్టర్ ఒప్పుకునే అవకాశం ఉందని సమాచారం. దీనిపై ఆయన అభిమానులు తీవ్రమైన అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి విలన్ రోల్ అంటే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది, చూడొచ్చులే అని అనుకున్నారు, ఇక మీదట కూడా అలాంటి క్యారెక్టర్స్ చేస్తే అసలు ఒప్పుకోము అంటూ సోషల్ మీడియా వేదికగా నాగార్జున ని ట్యాగ్ చేసి మండిపడుతున్నారు.
Also Read : రజినీకాంత్ ‘జైలర్ 2’ లో బాలయ్య సైకో పోలీస్ గా కనిపించబోతున్నాడా..?
నాగార్జున సాధారణమైన హీరో కాదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో నిన్నటి జనరేషన్ లో రెండు దశాబ్దాల పాటు టాప్ 3 హీరోలలో ఒకరిగా కొనసాగిన స్టార్ హీరో. ఆయన తోటి సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మరియు విక్టరీ వెంకటేష్ వంటి వారు ఈ వయస్సు లో కూడా సోలో హీరోలుగా 200 కోట్ల రూపాయిల గ్రాస్ సినిమాలను అవలీలగా అందుకుంటున్నారు. అలాంటి సమయం లో నాగార్జున కూడా సోలో హీరోగా కం బ్యాక్ ఇస్తే బాగుంటుందని ఆయన అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు. కానీ నాగార్జున మాత్రం ఈ రూట్ లో వెళ్లడం పై తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇదే ‘జైలర్ 2’ చిత్రం లో నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ చేస్తున్నాడు. అంటే సినిమాలో కచ్చితంగా బాలకృష్ణ, నాగార్జున మధ్య ఫైట్ సన్నివేశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అది అసలు చూడలేమంటూ అక్కినేని అభిమానులు అంటున్నారు. చూడాలి మరి నాగార్జున ఈ క్యారక్టర్ ఒప్పుకుంటాడా లేదా అనేది.