https://oktelugu.com/

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ ఆగిపోయినట్టేనా..?అసలు ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నాడు..?

Jai Hanuman : హనుమాన్ (Hamuman) సినిమాతో పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma)...

Written By: , Updated On : March 3, 2025 / 11:10 AM IST
Jai Hanuman

Jai Hanuman

Follow us on

Jai Hanuman : హనుమాన్ (Hamuman) సినిమాతో పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma)…ఈ ఒక్క సినిమాతోనే 400 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసిన ఈయన తొందర్లోనే స్టార్ డైరెక్టర్ల పక్కన ప్లేస్ సంపాదించుకుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఈయన సినిమా సినిమాకి మధ్య భారీగా గ్యాప్ అయితే తీసుకుంటున్నాడు. హనుమాన్ సినిమా వచ్చి సంవత్సరం దాటినప్పటికి ఇప్పటివరకు మరో సినిమా అయితే స్టార్ట్ చేయలేదు. ఇక బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ (Mokshagna) ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను కూడా తనే తీసుకున్నాడు. మరి ఆ సినిమాని కూడా ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమా వస్తుందంటూ అనౌన్స్ చేసినప్పటికి ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ ని కూడా ఇవ్వడం లేదు. దాంతో ప్రతి ఒక్కరూ ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సినిమాల విషయంలో ఆయన కొంతవరకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం ఆయన మీద కొన్ని విమర్శలను చేస్తున్నారు.

50 కోట్ల బడ్జెట్ తో తీసిన హనుమాన్ సినిమా 400 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఇలాంటి ఒక టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి మరొక సినిమా వస్తే చూడాలని యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కానీ ఆయన మాత్రం సినిమాలేమీ స్టార్ట్ చేయకుండా ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి అందులో నుంచి సినిమాలను నిర్మిస్తాను అంటూ కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నాడు. ఇక దానికి తోడుగా చిన్న హీరోల సినిమాలకి కథలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇలా చేస్తే దర్శకుడిగా తనకున్న ఇమేజ్ కాస్త పోతుంది తప్ప వాటి ద్వారా ఆయనకు వచ్చే లాభం అయితే ఏమీ ఉండదు అంటూ కొంతమంది విమర్శకులు అతన్ని విమర్శిస్తున్నారు.

Also Read : ‘హనుమాన్’ గా ‘కాంతారా’ హీరో రిషబ్ శెట్టి..గూస్ బంప్స్ రప్పిస్తున్న ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్!

అయిన కూడా తను ఏది పట్టించుకోకుండా అలాగే ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేతిలో మోక్షజ్ఞ సినిమా ఉందా? లేదంటే బాలయ్య బాబు అతని ప్లేస్ లో మరొక దర్శకుడితో ఆ సినిమా చేయించే ప్రయత్నం చేస్తున్నారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇక ‘జై హనుమాన్’ సినిమా కోసం రిషబ్ శెట్టి ని ఎంచుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. కానీ ఈ సినిమాకు సంబంధించిన షూట్ మాత్రం ఇప్పటివరకు మొదలు పెట్టలేదు…

Also Read : జై హనుమాన్ సినిమాలో హనుమాన్ గా నటిస్తున్న స్టార్ హీరో…