Jai Hanuman’ first look poster : ‘హనుమాన్’ గా ‘కాంతారా’ హీరో రిషబ్ శెట్టి..గూస్ బంప్స్ రప్పిస్తున్న ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్!

హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా 'జై హనుమాన్' ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ హనుమంతుడి పాత్రని ఎవరు పోషించబోతున్నారు అనే విషయంలో నిన్న మొన్నటి వరకు ఉత్కంఠ ఉండేది. నేడు మేకర్స్ ఆ ఉత్కంఠకి తెరదించుతూ 'కాంతారా' చిత్రంలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి ని హనుమంతుడి గెటప్ లో పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు.

Written By: Vicky, Updated On : October 30, 2024 9:39 pm

Jai Hanuman' first look poster

Follow us on

Jai Hanuman’ first look poster : ఈ ఏడాది సంక్రాంతికి చిన్న సినిమాగా విడుదలై, బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రం ‘హనుమాన్’. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రానికి పోటీకి దిగడంతో ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఇవ్వడానికి బయ్యర్స్ ఆసక్తి చూపించలేదు. దొరికిన థియేటర్స్ లో వేసుకొని విడుదల చేసారు. కానీ సినిమాలో బలమైన కంటెంట్ ఉండడంతో రెండవ రోజు నుండి థియేటర్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. మొదట్లో ఎవరైతే థియేటర్స్ ఇవ్వము అని పొగరుగా సమాధానం చెప్పారో, వాళ్ళే మా థియేటర్స్ లో వేసుకోండి అని నిర్మాతలను బ్రతిమిలాడారు. ఆ స్థాయిలో ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి భారీ వసూళ్లు వచ్చాయి. అలా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఈ సినిమాకి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ హనుమంతుడి పాత్రని ఎవరు పోషించబోతున్నారు అనే విషయంలో నిన్న మొన్నటి వరకు ఉత్కంఠ ఉండేది. నేడు మేకర్స్ ఆ ఉత్కంఠకి తెరదించుతూ ‘కాంతారా’ చిత్రంలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి ని హనుమంతుడి గెటప్ లో పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ పోస్టర్ లో రిషబ్ శెట్టి ని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. సాక్ష్యాత్తు హనుమంతుడు దిగి వస్తే ఎలా ఉంటాడో, అలా ఆయన గెటప్ ని డిజైన్ చేసారు. ముఖ్యంగా ఆ ఫిజిక్ ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ పాత్రకు దగ్గుబాటి రానా తప్ప ఎవ్వరూ న్యాయం చేయలేరని అనుకున్నారు. కానీ రిషబ్ శెట్టి ఈ రేంజ్ లో సూట్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఒక పక్క ‘కాంతారా’ ప్రీక్వెల్ లో నటిస్తూనే, మరోపక్క ‘జై హనుమాన్’ కి డేట్స్ ని కేటాయించాడు రిషబ్ శెట్టి. రెండు చిత్రాలకు డిఫరెంట్ లుక్స్, ఏక కాలంలో లుక్స్ ని మైంటైన్ చేస్తూ చేయడం అనేది పెద్ద సాహసమే.

అంతటి టాలెంట్ ఉన్న నటుడు కాబట్టే, భారత దేశ ప్రభుత్వం ఆయన ప్రతిభ ని గుర్తించి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు తో సత్కరించింది. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించి, 2026 సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సీక్వెల్ కాబట్టి అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి, ఆ అంచనాలకు తగ్గట్టుగా , బడ్జెట్ విషయంలో ఎలాంటి పరిమితులు పెట్టుకోకుండా, ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఈ సినిమాలో తేజ సజ్జ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తాడట. ‘హనుమాన్’ చిత్రం నైజాం ప్రాంత హక్కులను కొనుగోలు చేసి, భారీ లాభాలను అర్జించిన ‘మైత్రీ మూవీ మేకర్స్’ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.