Homeఎంటర్టైన్మెంట్Jagapathi Babu: వాళ్ళ చేతిలో దారుణంగా మోసపోయిన జగపతిబాబు..!

Jagapathi Babu: వాళ్ళ చేతిలో దారుణంగా మోసపోయిన జగపతిబాబు..!

Jagapathi Babu: హీరో జగపతిబాబు ముక్కుసూటి మనిషి. మేటర్ ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తారు. తన వ్యసనాలు, దాని వలన ఎదురైన ఆర్థిక ఇబ్బందులు పలు ఇంటర్వ్యూలలో నేరుగా చెప్పేశాడు ఆయన. తాజాగా కొందరు వ్యక్తుల చేతుల్లో మోసపోయానని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. జగపతిబాబు ప్రస్తుతం బిజీ యాక్టర్. లెజెండ్(Legend) మూవీతో విలన్ గా మారిన ఆయన తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో నటిస్తున్నారు. విలన్, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు.

జగపతిబాబుకు ఉన్న ఫేమ్ రీత్యా ఆయన కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా జగపతిబాబు ఓ రియల్ ఎస్టేట్ సంస్థ యాడ్ లో నటించాడట. ఆ సంస్థ కస్టమర్లను మోసం చేస్తున్నట్లు ఆయన దృష్టికి వచ్చిందట. దాంతో భూమి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మోసపోవద్దు అని జగపతిబాబు సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. భూమి కొనే ముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ(RERA) నిబంధనలు తెలుసుకోవాలని సూచించాడు.

Also Read: Pushpa 2 Movie Sooseki Song: పుష్ప 2 లోని ‘సుసేకే నా సామి’ సాంగ్ ను దేవి ఆ సాంగ్ నుంచి కాపీ చేశాడా..?

సదరు సంస్థ జగపతిబాబును కూడా మోసం చేసిందట. కాబట్టి రియల్ ఎస్టేట్ మోసాల నుండి జాగ్రత్తగా ఉండాలని జగపతిబాబు అలర్ట్ చేశాడు. తనను మోసం చేసిన వారు ఎవరో త్వరలో బయటపెడతానని జగపతిబాబు అన్నారు. ముఖ్యంగా నగరాల్లో రియల్ ఎస్టేట్ మోసాలు ఎక్కువై పోయాయి. సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని రూపాయి రూపాయి పోగేసి దాచుకున్న మధ్య తరగతి కుటుంబాలు రియల్ ఎస్టేట్ మోసాల బారిన పడుతున్నారు.

Also Read: Dhanush: రెండో పెళ్లికి రెడీ అయిన ధనుష్…అమ్మాయి ఎవరో తెలిస్తే అవాక్కవుతారు..?

కాగా జగపతి బాబు గత ఏడాది రుద్రంగి, రామబాణం చిత్రాల్లో నటించారు. ప్రభాస్(Prabhas) పాన్ ఇండియా చిత్రం సలార్ లో కీలక రోల్ చేశారు. సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారంలో విలన్ రోల్ చేశాడు. రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే సలార్ 2 త్వరలో పట్టాలెక్కనుంది. పుష్ప 2లో సైతం జగపతిబాబు కీలక రోల్ చేస్తున్నాడని సమాచారం.

RELATED ARTICLES

Most Popular