Vadala Box Office: హీరోగా మార్కెట్ ని పూర్తిగా కోల్పోయిన తర్వాత సీనియర్ హీరో జగపతి బాబు విలన్ రోల్స్ కి షిఫ్ట్ అవ్వడం వల్ల , ఆయన కెరీర్ ఏ రేంజ్ లో దూసుకుపోయిందో మన కళ్లారా చూశాము . కేవలం విలన్ రోల్స్ మాత్రమే కాకుండా, అద్భుతమైన క్యారెక్టర్ రోల్స్ చేస్తూ , నేటి తరం ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు జగపతి బాబు. అయితే చాలా కాలం తర్వాత ఆయన హీరో గా నటించిన చిత్రం ‘వదలా’. రీసెంట్ గా ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జగపతి బాబు మాలాడుతూ , ఈ సినిమాకు బిజినెస్ జరగలేదు , అందుకే షూటింగ్ పూర్తి అయ్యాక కూడా మేము విడుదల చేయలేకపోయాము. ఇప్పుడు నిర్మాత సొంతగా విడుదల చేస్తున్నారు. మీరే ఈ సినిమాని చూసి సక్సెస్ చెయ్యాలి అంటూ చెప్పుకొచ్చారు.
కానీ ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. రీసెంట్ గానే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాకు , కనీసం ప్రింట్ ఖర్చులు కూడా రీకవర్ అవ్వలేదంటే నమ్ముతారా?, కానీ అదే జరిగింది. వీకెండ్ పూర్తి అయ్యాక , నేడు హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క షో కూడా లేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఏ రేంజ్ లో రిజెక్ట్ చేశారు అనేది. అయితే ఆరోజుల్లో జగపతి బాబు తో సరిసమానమైన ఇమేజ్ ని సంపాదించుకున్న శ్రీకాంత్ కూడా చాలా కాలం తర్వాత . ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అనే చిత్రం చేశారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి చాలా డీసెంట్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఒకే కాలానికి చెందిన సమకాలీన హీరోలు , ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యి , మళ్లీ చాలా కాలం తర్వాత హీరో గా చేస్తే ఆడియన్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ ఇది.
‘వదలా ‘ చిత్రం ఇంత పెద్ద ఫ్లాప్ అవ్వడానికి గల కారణం , స్టోరీ నే. స్టోరీ విషయానికి వస్తే , చాలా సంతోషకరమైన జీవితాన్ని తన కుటుంబం తో కలిసి జీవిస్తున్న హీరో, ఒక రోజు రోడ్డు ప్రమాదానికి గురైన ఒక యువతిని కాపాడి , ఆమెకు వైద్యం చేసి బ్రతికిస్తాడు. ఆ తర్వాత ఆ యువతీ హీరో కుటుంబానికి దగ్గర అవుతుంది. హీరో మీద పిచ్చి ఇష్టాన్ని పెంచుకొని , అతనికి దగ్గరయ్యే ప్రతీ ఒక్కరిని టార్చర్ చేస్తుంది. అలా సైకో విలన్ గా మారిన ఈ యువతి నుండి హీరో తన కుటుంబాన్ని ఎలా రేఖించుకున్నాడు అనేదే స్టోరీ. ఇలాంటి సినిమాలు ఈమధ్య కాలం లో ఎన్ని చూసి ఉంటాం?, కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడం వల్లే , ఈ సినిమా ఇంత పెద్ద ఫ్లాప్ అయ్యింది.


