Ram Charan Surgery: సోషల్ మీడియా లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘పెద్ది’ మేనియా నే కనిపిస్తోంది. జూన్ 4 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కి సంబంధించి , మేకర్స్ రోజుకి ఒక అప్డేట్ ఇస్తూ , అభిమానుల్లో ఎక్కడ లేని జోష్ ని నింపుతున్నారు. ఈ సినిమాలో నటించిన నటీనటులకు సంబంధించిన క్యారెక్టర్స్ ని ప్రతీ రోజు ఒక్కొక్కటిగా పరిచయం చేస్తున్నారు మేకర్స్. నిన్న జగపతి బాబు క్యారక్టర్ ని ఆయన గెటప్ ని రివీల్ చేయగా , దానికి ఫ్యాన్స్ నుండి ఎలాంటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూశాము. ఇక నేడు హీరోయిన్ జాన్వీ కపూర్ కి క్యారెక్టర్ ని రివీల్ చేయబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే , డైరెక్టర్ బుచ్చి బాబు కూడా నాన్ స్టాప్ గా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు , సినిమాకు సంబంధించిన విశేషాలను చెప్తూ ఆడియన్స్ లో హైప్ పెంచుతున్నాడు.
ఇది ఇలా ఉండగా నిన్న రామ్ చరణ్ ముంబై లోని ఒక సెలూన్ నుండి బయటకు వస్తున్న వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అందులో రామ్ చరణ్ అద్భుతమైన మేకోవర్ ని చూసి ఆనందపడాలో , లేకపోతే ఆయన చేతికి కట్టిన కట్టు చూసి బాధపడాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే రామ్ చరణ్ కి షూటింగ్ సమయంలో జరిగిన గాయాల గురించి నిర్మాత సతీష్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘కుస్తీ ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కినప్పుడు రామ్ చరణ్ గారి కంటికి మాత్రమే కాదు, మణికట్టుకి కూడా దెబ్బలు తగిలాయి. మరో రెండు రోజుల్లో రామ్ చరణ్ మణికట్టుకు సర్జరీ జరగబోతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ప్రాణం పెట్టి పనిచేశారని , ఆయన విశ్వరూపాన్ని మీరంతా జూన్ 3 న చూడబోతున్నారని అంటున్నాడు.
మేకర్స్ ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ సాయంత్రం 6 గంటల నుండి మొదలు పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన లో ఉన్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు , ఇండియా మొత్తం మీద ఈ ప్రీమియర్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అట మేకర్స్. అంటే జూన్ 3 న 6 గంటలకు ఒక ప్రీమియర్ షో, 9 గంటలకు మరో ప్రీమియర్ షో ఉండబోతుంది అన్నమాట. ఈ రెండు ప్రీమియర్ షోస్ తో కచ్చితంగా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ప్రీమియర్స్ రికార్డు ని బద్దలు కోరుతామని అంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రీమియర్ షో టికెట్ రేట్ 600 రూపాయిలు ఉండనుంది. అదే విధంగా తెలంగాణ లో కూడా అదే రేట్ కి దరఖాస్తు చేసుకున్నారు , మరి ప్రభుత్వం అందుకు అనుమతి ఇస్తుందో లేదో చూడాలి.