బుల్లితెరపై జగ్గుభాయ్..!

ప్రముఖ నటుడు, హీరో జగపతిరావు బుల్లితెరపై హోస్ట్ గా వ్యవహరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జెమినీ టీవీ నిర్వహించే ఓ గేమ్ షోకి హోస్ట్‌గా వ్యహరించనున్నారు. ఈ గేమ్ షో త్వరలోనే ప్రారంభం కానుంది. హీరోగా, విలన్ గా, నటుడిగా విభిన్న పాత్రలు పోషించిన జగ్గుబాయ్ తాజాగా హోస్ట్ గా మారడం ఆసక్తికరంగా మారింది. నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడిగా సినిమా రంగానికి జగతిబాబు పరిచమయ్యాడు. దాదాపు వందకు పైగా సినిమాల్లో జగపతిబాబు నటించాడు. తొలి సినిమాలోనే […]

Written By: Neelambaram, Updated On : March 9, 2020 6:39 pm
Follow us on

ప్రముఖ నటుడు, హీరో జగపతిరావు బుల్లితెరపై హోస్ట్ గా వ్యవహరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జెమినీ టీవీ నిర్వహించే ఓ గేమ్ షోకి హోస్ట్‌గా వ్యహరించనున్నారు. ఈ గేమ్ షో త్వరలోనే ప్రారంభం కానుంది. హీరోగా, విలన్ గా, నటుడిగా విభిన్న పాత్రలు పోషించిన జగ్గుబాయ్ తాజాగా హోస్ట్ గా మారడం ఆసక్తికరంగా మారింది.

నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడిగా సినిమా రంగానికి జగతిబాబు పరిచమయ్యాడు. దాదాపు వందకు పైగా సినిమాల్లో జగపతిబాబు నటించాడు. తొలి సినిమాలోనే డ్యూయల్ రోల్ చేసిన నటుడుగా జగపతిబాబు చరిత్ర సృష్టించారు. ఎక్కువగా ఇద్దరు హీరోయిన్స్ తో నటించి మరో శోభన్ బాబుగా పేరు తెచ్చుకున్నాడు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచిపేరు సంపాందించుకున్నాడు. తాజాగా బుల్లితెరపై హోస్ట్ గా అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

బుల్లితెరపై ఇప్పటికే కింగ్ నాగర్జున, మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించి సత్తా చాటారు. ఎన్టీఆర్, నానిలు, రోజాలు పలు కార్యక్రమాలకు హోస్ట్ చేశారు. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై అభిమానులను అలరించారు. ప్రస్తుతం ఈ లిస్టులోకి జ‌గ‌ప‌తిబాబు కూడా చేరతుండటం ఆసక్తిని రేపుతోంది.