https://oktelugu.com/

Jagapathi Babu: జగపతి బాబు ఇంట్లో దొంగలు పడ్డారు..దానికి ఆయన ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు..?

ఒకప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న జగపతిబాబు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో మంచి పాత్రలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : April 19, 2024 / 01:05 PM IST

    Jagapathi Babu Help Families Of Thieves

    Follow us on

    Jagapathi Babu: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు తెరమీద నటించి ప్రేక్షకుల దగ్గర నుంచి టికెట్ల రూపంలో డబ్బులను కొల్లగొట్టి వాళ్ళు భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్స్ తీసుకుంటూ స్టార్లు గా గుర్తింపు పొందుతారు. కానీ వాళ్లలో చాలామంది చాలా రకాలైన సేవలను చేస్తుంటారు. ఇక పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి వారు ఎంతోమందికి దానధర్మాలు చేసిన విషయం మనకు తెలిసిందే.

    ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే అడిగిన వారికి కాదనకుండా సహాయం చేస్తూ ఉంటాడు. ఇక చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అతన్ని ‘భోళా శంకరుడు’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆపద ఉందని వచ్చిన ప్రతి ఒక్కరిని ఆడుకుంటూ ఉంటాడు. ఇక మొదటి నుంచి కూడా చిరంజీవి అలా సహాయం చేస్తు వచ్చినవాడే.. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న జగపతిబాబు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో మంచి పాత్రలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే జగపతి బాబు కూడా చాలామందికి సహాయాన్ని చేస్తూ ఉంటాడు. కానీ ఆయన ఎప్పుడు ఎవరికీ చెప్పుకోడు. అయినప్పటికీ ఆయన నుంచి సహాయం పొందిన వారు మాత్రం ఆయన పట్ల ఎప్పుడు కృతజ్ఞతా భావాన్ని చూపిస్తూ ఉంటారు.

    ఇక ఇదిలా ఉంటే ఒకానొక సందర్భంలో జగపతిబాబు ఇంట్లో కొంతమంది దొంగలు పడ్డారట. ఇక దాంతో జగపతిబాబు వాళ్లను గుర్తించి పోలీసులకి పట్టించాడట. ఇక ఆ జైల్లో ఉన్న దొంగల భార్యలు జగపతి బాబు ఫోన్ నెంబర్ తెలుసుకొని ఆయనకు ఫోన్ చేసి మా భర్తలు జైల్లో ఉండడం వల్ల మా జీవితాలు అగమ్యగోచరంగా మారిపోయాయి. ప్రస్తుతం పిల్ల పాపలతో మేము రోడ్డు మీద పడ్డాం అంటూ జగపతి బాబుకి చెప్పడంతో వాళ్ళ మాటలకి కరిగిపోయి వాళ్లకి డబ్బు రూపంలో కొత్త సహాయం అయితే అందించారట. ఇక ఒక్కసారి ఇచ్చి చేతులు దులుపుకోలేదు. జైల్లో పడ్డ ఆ దొంగలు జైలు నుంచి రిలీజ్ అయ్యేంతవరకు ఆయన ప్రతినెల ఎంతో కొంత డబ్బులైతే వాళ్లకు పంపిస్తూ వచ్చారట.

    ఇక ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో జగపతి బాబు గారే తెలియజేయడం విశేషం.. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న చాలా మంది ఆయన అభిమానులు ఇంట్లో దొంగతనానికి వచ్చిన వాళ్ళకి కూడా సహాయం చేశారు అంటే మీది ఏం గుండె సార్ అంటూ సోషల్ మీడియాలో జగపతిబాబు మంచితనం మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు…