spot_img
Homeఎంటర్టైన్మెంట్Jagapathi Babu Comments on Chiranjeevi: నేను చరణ్ ని అలా అన్నందుకు చిరంజీవి ఇప్పటికీ...

Jagapathi Babu Comments on Chiranjeevi: నేను చరణ్ ని అలా అన్నందుకు చిరంజీవి ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉంటాడు – జగపతి బాబు

Jagapathi Babu Comments on Chiranjeevi: ఇండస్ట్రీ లో ముక్కు సూటి తనంతో , ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే హీరోలలో ఒకరు జగపతి బాబు. ఈయన ప్రసంగాల్లో ఒక నిజాయితీ ఉంటుంది , ఎలాంటి డ్రామా ఉండదు. ఇండస్ట్రీ లో సీనియర్ హీరోల దగ్గర నుండి , నేటి తరం స్టార్ హీరోల దగ్గర వరకు ప్రతీ ఒక్కరితో జగపతి బాబు కి ఉన్నటువంటి సాన్నిహిత్యం సాధారణమైనది కాదు. నేటి తరం స్టార్ హీరోలతో ఆయన ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో కలిసి నటించేశాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి రీసెంట్ గానే ‘పెద్ది’ అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమాలో ఆయన పోషించిన అప్పలసూరి అనే పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గతంలో రామ్ చరణ్ తో ఆయన ‘రంగస్థలం’ అనే చిత్రం చేశాడు . ఈ రెండు సినిమాల్లో చరణ్ తో కలిసి పనిచేసిన అనుభవం గురించి , అదే విధంగా పెద్ది మూవీ విశేషాల గురించి డైరెక్టర్ బుచ్చి బాబు తో కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు బుచ్చి బాబు.

ఈ ఇంటర్వ్యూ లో ఆయన గతంలో చరణ్ విషయం లో చిరంజీవి తో తనకు ఎదురైన ఒక సందర్భం గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో , రామ్ చరణ్ మొట్టమొదటి సారి అద్బుతమగా నటించాడని అన్నాను. అందుకు చిరంజీవి గారు ఫీల్ అయ్యారు , అదేంటి జగపతి బాబు అలా అనేసావు అన్నాడు. నిజంగా నాకు అనిపించిందే చెప్పాను సార్ అన్నాను. కానీ రామ్ చరణ్ కెరీర్ అక్కడి నుండి ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది. నటుడిగా ఆయన ఎవ్వరూ చూడనంత పీక్ రేంజ్ ని చూసేసాడు. ఈరోజు చెప్తున్నాను , పెద్ది చిత్రం రామ్ చరణ్ కెరీర్ లోనే నెంబర్ 1 పెర్ఫార్మన్స్ గా నిలిచిపోతుంది. అంత అద్భుతంగా నటించాడు. చిరంజీవి గారి అబ్బాయిని ఇంత కష్టపెట్టిన డైరెక్టర్ బహుశా ఇండియా లో నువ్వేనేమో’ అంటూ జగపతి బాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నా కెరీర్ లోనే అప్పలసూరి క్యారెక్టర్ టాప్ 5 లో ఒకటిగా ఉంటుంది. ఇండస్ట్రీ కి చెందిన ఒక ప్రముఖ డైరెక్టర్ ఫోన్ చేసి నాతో ఒక మాట అన్నాడు. ఇదే అప్పలసూరి క్యారెక్టర్ ఇతర భాషలకు సంబంధించిన టాప్ నటీనటులు చేసుంటే , పొగడ్తలతో ముంచి ఎత్తేవారు , వేరే లెవెల్ లో లేపేవాళ్లు, కానీ తెలుగు వాడు అవ్వడం వల్ల , ఈ పాత్ర గురించి రివ్యూయర్స్ ప్రత్యేకంగా మాట్లాడడం లేదు. తెలుగు ఆర్టిస్టుగా పుట్టడం మీ దురదృష్టకరం అని అన్నాడు’ అంటూ జగపతి బాబు చెప్పుకొచ్చాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular