Tollywood: టాలీవుడ్ ను చావుదెబ్బ తీసిన జగన్.. షాకింగ్ నిర్ణయం

Tollywood: ‘ములిగే నక్కపై తాటిపండు’ పడ్డ చందంగా టాలీవుడ్ పరిస్థితి మారింది . ఓవైపు కరోనా మరోవైపు ఏపీ సర్కార్ టాలీవుడ్ ఇండస్ట్రీపై ముప్పేట దాడికి దిగుతున్నాయి. దీంతో టాలీవుడ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీంతో ఇక తమకు దేవుడే దిక్కుంటూ శరణు వేడుకుంటున్నారు. గత రెండేళ్లుగా కరోనాతో అత్యధికంగా నష్టపోయే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది సినీ పరిశ్రమే. కరోనా పరిస్థితుల నుంచి కోలుకుంటున్న సమయంలోనే జగన్ సర్కారు సినిమా టికెట్ల రేట్లను తగ్గించడం […]

Written By: Raghava Rao Gara, Updated On : January 10, 2022 5:21 pm
Follow us on

Tollywood: ‘ములిగే నక్కపై తాటిపండు’ పడ్డ చందంగా టాలీవుడ్ పరిస్థితి మారింది . ఓవైపు కరోనా మరోవైపు ఏపీ సర్కార్ టాలీవుడ్ ఇండస్ట్రీపై ముప్పేట దాడికి దిగుతున్నాయి. దీంతో టాలీవుడ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీంతో ఇక తమకు దేవుడే దిక్కుంటూ శరణు వేడుకుంటున్నారు.

AP Theaters

గత రెండేళ్లుగా కరోనాతో అత్యధికంగా నష్టపోయే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది సినీ పరిశ్రమే. కరోనా పరిస్థితుల నుంచి కోలుకుంటున్న సమయంలోనే జగన్ సర్కారు సినిమా టికెట్ల రేట్లను తగ్గించడం ఇండస్ట్రీకి పుండుమీద కారం రాసినట్లుగా తయారైంది.

కరోనా సమయంలో చిన్న సినిమాలన్నీ ఓటీటీల్లో విడుదలై సేఫ్ అయ్యాయి. అయితే పెద్ద సినిమాలు మాత్రం థియేటర్ల కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. కొద్దిరోజులుగా పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలతూ కనెక్షన్లు సాధిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో జగన్ సర్కారు టికెట్ల రేట్లను తగ్గించడం, బెనిఫిట్ షోలు రద్దు చేయడం, ఆన్ లైన్ టికెటింగ్, థియేటర్లను సీజ్ చేయడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఇండస్ట్రీని భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా జగన్ సర్కార్ ఇండస్ట్రీకి గట్టి షాక్ ఇచ్చింది.

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. థియేటర్లో 50శాతం అక్సుపెన్సీకి మాత్రమే ఉండాలని నిర్ణయం తీసుకోంది.

మరోవైపు 11గంటలకు వరకు నైట్ కర్ఫ్యూ ఉండటంతో సెకండ్ షోపై ఎఫెక్ట్ పడనుంది. రూ. 5, రూ.10, రూ.15ల టికెట్ల రేట్లకు తోడుగా 50శాతం అక్సుపెన్సీతో థియేటర్లను నిర్వహించడం కత్తి మీద సాములా మారింది.

దీంతో థియేటర్ యాజమాన్యాలు పూర్తిగా మూసివేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు సంక్రాంతి రేసులో నాగార్జున బంగార్రాజు, రౌడీ బాయ్స్ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.

జగన్ సర్కారు నిర్ణయంతో ఈ సినిమాలు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీ సర్కారు దారిలోనే తెలంగాణ సర్కారు థియేటర్లపై ఇలాంటి నిర్ణయం తీసుకుంటే టాలీవుడ్ పరిస్థితి ఏంటా? అనే చర్చ జోరుగా సాగుతోంది.