Nagarjuna: ఏపీలో థియేటర్లు, టికెట్ రేట్ల వ్యవహారం పై జగన్ తో మెగాస్టార్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ పై హీరో అక్కినేని నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ.. ‘మా అందరి కోసమే చిరంజీవి గారు జగన్ గారితో సమావేశం అయ్యారు. ఆయన నాతో జగన్ దగ్గరకి వెళ్తున్నా అని చెప్పారు. అయితే, నా సినిమా విడుదల ఉండటం వల్ల నేను వెళ్లలేకపోయాను. నిజానికి జగన్ తో సమావేశం ఉంటుందని వారం క్రితమే చిరంజీవి చెప్పారు.

చిరంజీవి తన ఒక్కరి కోసం వెళ్లటం లేదు. అందరి కోసం వెళ్లారు. సీఎం జగన్ తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ కు చిరంజీవి అంటే ఇష్టం. అందుకే , చిరంజీవి వెళ్తా అనగానే నేను వెళ్లమని సలహా ఇచ్చాను. ఇద్దరి భేటీతో ఇండస్ట్రీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నా. అయితే, నేను టికెట్ రేట్లపై స్పందించింది కేవలం నా సినిమా వరకు మాత్రమే’ అని మీకు మళ్ళీ చెబుతున్నా అంటూ నాగార్జున తెలిపాడు.
Also Read: ఏళ్లుగా మంచానికే పరిమితమైన వ్యక్తి.. టీకా వేయగానే ఒంట్లో కదలికలు, మాటలు..!
ఇక గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్తూ చిరు మీడియాతో మాట్లాడుతూ.. ‘మరో గంటన్నరలో టికెట్ రేట్లతో పాటు అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తానని.. సీఎం ఆహ్వానం మేరకు ఇండస్ట్రీ బిడ్డగా వచ్చినట్లు చిరు చెప్పారు. అయితే, తాజా సమాచారం ప్రకారం. చిరు – జగన్ కలిసి లంచ్ చేస్తున్నారు. లంచ్ తర్వాత 15 నిమిషాల పాటు ఇద్దరు చర్చించనున్నారు.
మరి వీరి మధ్య చర్చ పూర్తి అయిన తర్వాత వైఎస్ జగన్ ఎలాంటి ప్రకటన చేస్తాడో ? చూడాలి. టికెట్ల రేట్ల విషయంలో సినిమా జనానికి మేలు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఒకవేళ సినిమా పరిశ్రమకు మేలు జరిగేలా జగన్ నిర్ణయం తీసుకుంటే గనుక అది మెగాస్టార్ గొప్పతనమే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి – జగన్ భేటీ ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచుస్తునారు.
Also Read: ఆ డెరెక్టర్ వైవాహిక జీవితంలో చిచ్చుపెట్టిన ప్రముఖ హీరోయిన్..!
[…] […]
[…] […]