Homeఆంధ్రప్రదేశ్‌జగన్ నుండి చిరంజీవికి రాజ్యసభ సీటు.. నిజమెంత ?

జగన్ నుండి చిరంజీవికి రాజ్యసభ సీటు.. నిజమెంత ?

Chiranjeeviఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ముందుకు పోతున్నాడు. ఎవరిని ఎక్కడ ఎలా వాడుకోవాలి ? ఎవరికి ఏది ఇవ్వాలి లాంటి వాటిల్లో జగన్ ఆరితేరిపోయారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వనున్నారనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలు మెగాభిమానులను ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా కలవరపాటుకు గురి చేశాయి.

ఒకవేళ మెగాస్టార్ ఆ పదవిని స్వీకరిస్తే ? ఇక పవన్ కళ్యాణ్ రాజకీయానికి అది పెద్ద దెబ్బ అవుతుంది కదా ? జగన్ ను వ్యతిరేకిస్తూ పవన్ పోరాటం చేస్తుంటే.. చిరంజీవి జగన్ పంచన చేరితే.. పవన్ కళ్యాణ్ ప్రజల్లో పలచన అయిపోవడం ఖాయం. పైగా ఇప్పుడు అందరివాడుగా ఉన్న మెగాస్టార్ మరోసారి రాజకీయాల్లోకి వచ్చి భంగపాటు పడటం అవసరమా ?

పైగా జగన్ ఇచ్చే పదవి స్వీకరించి మళ్ళీ రాజకీయంగా తప్పటడుగులు వేయడం ఎంతవరకు కరెక్టు ? మెగాస్టార్ మళ్ళీ ఎలాంటి రాజకీయ పొరపాట్లు చేయొద్దనేది మెగాభిమానుల అభిప్రాయం. అసలు ఇంతకీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజంగానే మెగాస్టార్ ను తన వైపు తిప్పుకోవడానికి ప్లాన్ వేశాడా ? తన రాజకీయ ప్రణాళిక ప్రకారం చిరంజీవికి జగన్ గాలం వేశాడా ?

మరి జగన్ గాలానికి చిరంజీవి స్పందన ఏమిటి ? అని ఆరా తీస్తే… ఈ వార్త పై ఫుల్ క్లారిటీ వచ్చింది. చిరంజీవి వర్గం ఇదంతా ఊహాగానమే అంటోంది. వాస్తవానికి జగన్ ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రపోజల్ తమకు రాలేదని, కానీ మీడియాలో వార్తలు వచ్చాయని, ఆ వార్తలు మమ్మలను కూడా బాగా ఆశ్చర్యపరిచాయని చిరంజీవి టీం చెప్పుకొచ్చింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version