Jagan Bhimavaram Meeting: వైసీపీ పార్టీ అధ్యక్షులు , మాజీ ముఖ్యమంత్రి జగన్ నేడు భీమవరం లో ఆక్వా రైతులకు అండగా ఒక భారీ సభ ని ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆయన కూటమి ప్రభుత్వం ఆక్వా రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుని ఎండగడుతూ , ఉపన్యాసం అందించారు. అయితే సభ ప్రాంగణం లోకి వచ్చిన తర్వాత , స్టేజి మీద ఎక్కుతున్న సమయం లో చిన్నపాటి తోపులాట జరిగింది. అసలే కాలు నొప్పితో ఇబ్బందితో పడుతున్న జగన్ , ఈ టాపులాట కారణంగా క్రింద పడిపోయారు. తదుపరి సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై , ఆయన్ని పైకి లేపారు. అదృష్టం కొద్దీ జగన్ కి ఎలాంటి తీవ్రమైన గాయాలు అవ్వలేదు. జగన్ ఒక్కసారిగా క్రింద పడడంతో సభ ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. చాలా కాలం తర్వాత జగన్ ఏర్పాటు చేసిన సభ కావడంతో అభిమానుల తాకిడి విపరీతంగా ఉంది.
ఒక వీరాభిమాని అయితే స్టేజి మీదకు దూసుకొచ్చి , జగన్ కాళ్ళను గట్టిగా పట్టుకొని లాగారు. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీంతో ఏ నాయకుడికైనా ఈ వీరాభిమానులు బాధలు తప్పేలా లేవు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడు జనాల మధ్యలోకి వచ్చినా , ఇలాంటివి జరుగుతూనే ఉండేవి. ఆయన చేతులను , కాళ్ళను పట్టుకొని అభిమానులు లాగడం వల్ల , చాలా గాయాలు అయ్యాయి. ముఖ్యంగా ఆయన భుజాలు బాగా దెబ్బ తిన్నాయి. ఇప్పుడు ముంబై లో ఆయన కీలక సర్జరీ చేయించుకోవడానికి కూడా ముఖ్య కారణం అదే. మాజీ సీఎం జగన్ కి కూడా ఎక్కడికి వెళ్లినా ఇలాంటి పరిస్థితే ఎదురు అవుతోంది. అభిమానులు తమ అభిమాన నాయకులపై ఇలా హద్దులు దాటినా ఎమోషన్స్ తో మీద పడితే , వాళ్లకు తీవ్రమైన బాధ కలుగుతుంది అనేది మర్చిపోతున్నారు.
ఇదొక్కటి దృష్టిలో పెట్టుకుంటే మంచిది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈరోజు జగన్ స్టేజి పై పడిపోవడానికి కూడా కారణం సభ నిర్వహణ లోపమే అని తెలుస్తోంది. అవసరానికి మించిన జనాలను స్టేజి మీద ఉంచడం వల్ల ఆయన రాగానే తోపులాట సంభవించింది. దీంతో ఆయన క్రిందకు పడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏమి జరగలేదు కాబట్టి పర్వాలేదు , ఒకవేళ ఏదైనా జరిగి ఉండుంటే ఏంటి పరిస్థితి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
View this post on Instagram
