Jagadeka Veerudu Athiloka Sundari : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కెరీర్ లో మాత్రమే కాదు, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సువర్ణసఖరాలతో లిఖించదగ్గ చరిత్ర ఉన్న చిత్రం ‘జగదేక వీరుడు..అతిలోక సుందరి'(Jagadeka Veerudu Athiloka Sundari). అప్పట్లో భారీ వరదల్లో విడుదలైన సినిమా ఇది. నిర్మాత అశ్వినీదత్ ని ఈ వరదల్లో సినిమా విడుదల చేస్తే చిల్లిగవ్వ కూడా రాదు, అసలే నష్టాల్లో ఉన్నావ్, నిండా మునిగిపోకు అని ఆయన్ని తన సన్నిహితులు చాలా భయపెట్టారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన సునామీ ముందు, అప్పట్లో వచ్చిన వరదలు భీభత్సం తేలిపోయింది. ఆరోజుల్లోనే దాదాపుగా పది కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన ఈ చిత్రానికి, ఇప్పటికీ కూడా విలువ తగ్గలేదు. ఎప్పుడు టీవీ లో టెలికాస్ట్ అయినా, బంపర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటుంది.
Also Read : చిరంజీవి జగదేక వీరుడు సినిమాను రీమేక్ చేయగలిగే గట్స్ ఉన్న ఏకైక హీరో అతనే..మనసులో మాట చెప్పిన మెగాస్టార్…
అలాంటి ఇండస్ట్రీ హిట్ ని ఈ నెల 9వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. కేవలం 2D వెర్షన్ లో 4K క్వాలిటీ తో మాత్రమే కాదు, 3D వెర్షన్ లో 8K క్వాలిటీ తో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది. 3D కోసం, అదే విధంగా 8K క్వాలిటీ కి మార్చడం కోసం నిర్మాత అశ్వినీదత్ 8 కోట్ల రూపాయిలు ఖర్చు చేశాడట. ఒక రీ రిలీజ్ చిత్రాన్ని, నేటి తరం ఆడియన్స్ కి, వివిధ ఫార్మట్స్ లో మార్చి రిలీజ్ చేయడం అనేది మొట్టమొదటిసారి ఈ చిత్రానికే జరిగింది. కల్కి డైరెక్టర్ నాగ అశ్విన్ పర్యవేక్షణ లో ఈ పనులు జరిగాయట. రీ రిలీజ్ కోసం ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారంటే క్వాలిటీ ఏ రేంజ్ లో ఉండచ్చో మీరే ఊహించుకోండి. రీ రిలీజ్ హిస్టరీ లో ఇలాంటి క్వాలిటీ సినిమా ఇప్పటి వరకు రాలేదు, భవిష్యత్తులో కూడా రాబోదు అనే విధంగా ఈ చిత్రాన్ని అప్గ్రేడ్ చేశారట.
9వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని నేడు సాయంత్రం నుండి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ సిటీ కి సంబంధించిన మొదటి చార్ట్ కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఇంత ఖర్చు చేసారు కదా, కలెక్షన్స్ ఆ రేంజ్ లో ఉంటాయా లేదా అని సోషల్ మీడియా లో అభిమానులు సందేహ పడుతున్నారు. 8 కోట్లు రీకవర్ అవ్వాలంటే దాదాపుగా 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలి. ఇప్పటి వరకు టాలీవుడ్ హిస్టరీ లో ఒక్క సినిమాకు కూడా ఆ రేంజ్ గ్రాస్ వసూళ్లు రాలేదు. అంత గ్రాస్ రావాలంటే హైప్ వేరే లెవెల్ లో ఉండాలి. ప్రస్తుతానికి అలాంటి హైప్ కూడా లేదు. మరి చూడాలి బుకింగ్స్ తర్వాత ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది.
Also Read : శ్రీదేవి 20 అడిగితే.. చిరంజీవి మరో 15 ఎక్కువ అడిగారు