Jagadeka Veerudu Athiloka Sundari Re-Release : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి'(Jagadekaveerudu Athiloka Sundari). వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న డైరెక్టర్ రాఘవేంద్ర రావు ఈ చిత్రాన్ని రిస్క్ చేసి మరీ తెరకెక్కించాడు. ఆరోజుల్లో ఈ చిత్రం బడ్జెట్ హద్దులు దాటింది. అయినప్పటికీ కూడా కమర్షియల్ గా సునామీ ని సృష్టించింది. ఆరోజుల్లోనే ఈ చిత్రానికి దాదాపుగా 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్ళు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రం కమర్షియల్ గా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనేది. ఇకపోతే ఈ చిత్రం విడుదలై 35 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా గత నెల 9 వ తారీఖున మరోసారి గ్రాండ్ రీ రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. దాదాపుగా మూడు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం.
Also Read : రికార్డు స్థాయిలో ‘హరి హర వీరమల్లు’ థియేట్రికల్ బిజినెస్..బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?
అయితే ఈ చిత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రతీ రోజు సాయంత్రం 6: 30 నిమిషాల షో ని రన్ చేస్తున్నారు. మే9 నుండి ఇప్పటి వరకు కొత్త సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఈ చిత్రాన్ని ముట్టుకోకుండా ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రసాద్ మల్టీప్లెక్స్ లో విడుదలైన రీ రిలీజ్ సినిమాల్లో ఆల్ టైం టాప్ 2 గ్రాసర్ గా నిల్చింది. పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’ చిత్రం రీ రిలీజ్ కి దాదాపుగా 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్ళు వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే ఆల్ టైం రికార్డు. ఈ సినిమా తర్వాతి స్థానం లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం 26 లక్షల రూపాయిల గ్రాస్ తో రెండవ స్థానం లో కొనసాగుతుంది.
ఇంకో పది రోజుల థియేట్రికల్ రన్ ఉండడం తో కచ్చితంగా ఈ చిత్రం 30 లక్షల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక రీ రిలీజ్ చిత్రం అది కూడా ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఇన్ని రోజులు ప్రదర్శితమవుతూ ఇప్పటికీ హౌస్ ఫుల్స్ కలెక్షన్స్ తో నడవడం అనేది సాధారణమైన విషయం కాదు. భవిష్యత్తులో కూడా ఈ అరుదైన ఫీట్ ని ఎవ్వరూ రిపీట్ చేయలేరు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి కి సరైన కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడితే ఆడియన్స్ ఏ రేంజ్ లో థియేటర్స్ కి కదులుతారు అనే దానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ అని అంటున్నారు విశ్లేషకులు. రాబోయే చిరంజీవి సినిమాల్లో ఎదో ఒక చిత్రం ఈ రేంజ్ లో హిట్ అవ్వాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఇలాంటి మ్యాజిక్ ని మెగాస్టార్ మళ్ళీ ఎప్పుడు రీ క్రియేట్ చేయబోతున్నారు అనేది.