Hari Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం సరిగ్గా 11 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న చిత్రం, అది కూడా ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాక విడుదల అవుతున్న సినిమా కావడంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఆ స్థాయిలో ఎదురు చూస్తున్నారు. ఎంతైనా ఉప ముఖ్యమంత్రి ని వెండితెర మీద చూసుకోవడం అనేది ఎవరికైనా ఒక థ్రిల్లింగ్ అనుభూతి కలిగిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సుమారుగా 5 ఏళ్ళ నుండి సెట్స్ మీదున్న ఈ చిత్రం ఎన్నో కష్టాలను ఎదురుకొని షూటింగ్ కార్యక్రమాలను ఎట్టకేలకు పూర్తి చేసుకుంది. ఫ్యాన్స్ థియేట్రికల్ ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Also Read : సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపుతున్న ‘హరి హర వీరమల్లు’ యానిమేషన్ వీడియో!
అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ లో సంచలనమైన టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి నిర్మాత AM రత్నం పెట్టిన ఖర్చు మామూలుది కాదు. దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ని ఈ చిత్రం కోసం ఆయన ఖర్చు చేసాడు. అందుకే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయం లో అసలు తగ్గడం లేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం నైజాం ప్రాంతం హక్కులను నిర్మాత AM రత్నం దాదాపుగా 60 కోట్ల రూపాయలకు అమ్మాలని చూస్తున్నాడట. అంత ఇచ్చేందుకు బయ్యర్స్ ధైర్యం చేయకపోవడం తో 45 కోట్ల రూపాయిల అడ్వాన్స్ బేసిస్ మీద ఈ చిత్రం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే 45 కోట్ల రూపాయిల షేర్ తర్వాత ఎంత వచ్చినా AM రత్నం జోబులోకే వెళ్తుంది అన్నమాట. అన్ని ప్రాంతాల్లోనూ ఆయన ఇదే మోడల్ ని అనుసరిస్తున్నాడు.
సీడెడ్ ప్రాంతానికి గానూ AM రత్నం దాదాపుగా 25 నుండి 30 కోట్ల రూపాయిలను అడుగుతున్నాడట. బయ్యర్స్ అంత రేట్ కి సాహసించడం లేదు, దీంతో 20 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ బేసిస్ మీద డీల్ క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది. అలా ఓవరాల్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి AM రత్నం 170 కోట్ల రూపాయిల బిజినెస్ ని ఆశిస్తే, బయ్యర్స్ 130 కోట్ల రూపాయిల అడ్వాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రేపు లోపు డీల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా ఓవరాల్ గా అన్ని ప్రాంతాలకు కలిపి 200 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా 200 కోట్ల రూపాయిల షేర్ మార్కుని దాటాల్సిందే. పాజిటివ్ టాక్ వస్తే మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ అవుతుందని అందరు అనుకుంటున్నారు.