https://oktelugu.com/

Jagadam Movie Heroine : జగడం’ మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఎంత అందంగా తయారైందో చూస్తే ఆశ్చర్యపోతారు!

అక్కడే ఈమె స్వయంగా ఒక డ్యాన్స్ స్కూల్ కూడా నడుపుతున్నట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా లో ఈమెకి ఎలాంటి అకౌంట్స్ లేవు కానీ, ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ ఫోటోని మీరు కూడా చూసేయండి.

Written By:
  • Vicky
  • , Updated On : August 27, 2024 / 09:56 PM IST

    jagadam movie Heroine

    Follow us on

    Jagadam Movie Heroine : కొన్ని సినిమాలు బాగున్నప్పటికీ కూడా ఫ్లాప్ అవుతుంటాయి. ఎందుకంటే ఆ సినిమాలు అప్పటి ఆడియన్స్ కి చాలా అడ్వాన్స్ గా అనిపించడం, కేవలం కొంతమంది ఆడియన్స్ ని మాత్రమే టార్గెట్ చేసుకొని తియ్యడం వల్ల అలా జరుగుతుంటాయి. అలా ఆడియన్స్ కి అర్థంకాక ఫ్లాప్ అయిన చిత్రాలలో ఒకటి ‘జగడం’. ‘దేవదాసు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో రామ్, అలాగే ఆర్య లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత డైరెక్టర్ సుకుమార్ కలిసి చేసిన చిత్రమిది. విడుదలకు ముందు ఈ సినిమా మీద అంచనాలు ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉండేవి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఆడియో విడుదలకు ముందు యూత్ ని ఒక ఊపు ఊపేసింది. మితిమీరిన అంచనాల నడుమ విడుదల అవ్వడంతో ఈ సినిమాకి మొదటి ఆట నుండే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది.

    jagadam Heroine

    ఫలితంగా ఈ చిత్రం వారం గడవకముందే థియేటర్స్ నుండి బయ్యర్స్ లేపేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ సినిమాకి సోషల్ మీడియా వృద్ధి లోకి వచ్చిన తర్వాత నేటి తరం ఆడియన్స్ కి బాగా నచ్చింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు స్టార్ హీరోకి పడుంటే ఇండస్ట్రీ లో ఒక్క రికార్డు కూడా మిగిలేది కాదని డైరెక్టర్ రాజమౌళి గతంలో ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన విషయం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమా నుండి ఆయన సుకుమార్ కి ఫ్యాన్ అయిపోయాడు. ఇకపోతే ఈ చిత్ర హీరోయిన్ ఇషా సహానీ కూడా అప్పటి ఆడియన్స్ కి బాగా నచ్చింది. ఎవరీ అమ్మాయి, ఇంత క్యూట్ గా ఉందేంటి అని కుర్రాళ్ళు అప్పట్లో ఈమె కోసమే థియేటర్స్ కి వెళ్లిన వారు ఉన్నారు. అయితే ఆ హీరోయిన్ ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఏ
    తెలుగు సినిమాలో కూడా కనిపించలేదు.

    కానీ తమిళం లో ‘బ్యాడ్ బాయ్’ అనే చిత్రంలో నటించింది. సినిమాల్లోకి రాకముందు ఈమె ఒక డ్యాన్సర్ గా ప్రఖ్యాతి పొందింది. ప్రారంభంలో ఆమె దక్షా సేత్ డ్యాన్స్ కంపెనీ లో మెయిన్ డ్యాన్సర్ గా పనిచేసేది. ఆ కంపెనీ ద్వారా ఆమె ఎన్నో లైవ్ షోలు కూడా చేసింది. ఒక డ్యాన్సర్ గా ఆమె సంపాదించిన గుర్తింపు ఎలాంటిదంటే, ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ సంస్థ విడుదల చేసిన టాప్ 100 సెలెబ్రిటీల లిస్ట్ లో ఇషా సహానీ కూడా ఒక సెలబ్రిటీ గా ఉంది. ఆ తర్వాత ఆమె డైరెక్టర్ సుకుమార్ దృష్టిలో పడడంతో జగడం చిత్రంలో హీరోయిన్ గా చేసే అవకాశం దక్కింది. ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్తని వెల్లడి లండన్ లో స్థిరపడింది. అక్కడే ఈమె స్వయంగా ఒక డ్యాన్స్ స్కూల్ కూడా నడుపుతున్నట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా లో ఈమెకి ఎలాంటి అకౌంట్స్ లేవు కానీ, ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ ఫోటోని మీరు కూడా చూసేయండి.