బాలీవుడ్ బోల్డ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చాలా ఓపెన్ గా ఉంటుంది. గతంలో ఓ సీనియర్ హీరోతో ప్రేమలో మునిగి తేలిన ఈ భారీ బ్యూటీ, ఆ తరువాత ఆ హీరోకి దూరం అయింది. అయితే, ఇప్పుడు ఆమెకి సంబంధించిన ఓ ప్రేమ వార్త మళ్ళీ వైరల్ అవుతుంది. ఈ సారి జాక్వెలిన్ సీరియస్ గా ప్రేమలో పడిందని బాంబే టైమ్స్ పత్రిక క్లారిటీ ఇచ్చింది.
ఆ పత్రిక కథనం ప్రకారం సౌత్ ఇండియాకు చెందిన ఒక వ్యాపారవేత్తతో ఆమె డీప్ లవ్ రిలేషన్ షిప్ లో ఉందని తెలుస్తోంది. గత ఏడాది నుండి ఇద్దరూ కలిసి సహ జీవనం చేస్తున్నారని కూడా అంటున్నారు. పైగా ఆ బిజినెస్ మెన్ రీసెంట్ గా ముంబైలోని ఖరీదైన జుహు ప్రాంతంలో జాక్వెలిన్ కోసం ఒక అపార్ట్మెంట్ కొన్నాడట. పైగా ఆమె కోసం ఓ ఖరీదైన కారును కూడా ఆమె పుట్టినరోజు సందర్భంగా బహుమతి ఇచ్చాడు.
ఇక జాక్వెలిన్ త్వరలోనే తన ప్రియుడు ఇచ్చిన అపార్ట్ మెంట్ లోకి షిఫ్ట్ కానుంది. మొత్తానికి శ్రీలంక నుండి వచ్చిన జాక్వెలిన్ నటిగా బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. పైగా బోల్డ్ పాత్రలకు ఆమె తెగింపు మరింత ప్లస్ అయింది. ఇక్కడ సినిమాలలో నటిస్తూ ఆమె ఇండియాలోనే సెటిల్ అయింది. రీసెంట్ గా జాక్వెలిన్ ఒక తెలుగు సినిమా అంగీకరించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ తీస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ఆమె ఒక రాకుమారిగా నటించబోతుంది. జులైలో జరిగే ఈ సినిమా షూటింగ్ లో ఆమె పాల్గొననుంది. ఏది ఏమైనా ఇటీవల ప్రియుళ్ళతో కలిసి అపార్ట్ మెంట్లు కొని, సహజీవనం చేస్తున్న హీరోయిన్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు. శృతి హాసన్ కూడా తన ప్రియుడు శాంతానుతో సహజీవనం చేస్తోంది. అలియా భట్ – రణబీర్ కపూర్ వ్యవహారం కూడా సహజీవనం దగ్గరే కొట్టుమిట్టాడుతూ ఉంది.