https://oktelugu.com/

Priyamani, Sunny Leone: సన్నీలియోన్, ప్రియమణి.. కాక రేపుతున్న గ్లామర్ హీరోయిన్లు

Priyamani, Sunny Leone: లేటేస్టుగా సన్నీ లియోన్, ప్రియమణిలు కలిసి నటించిన ఓ మూవీ అరాచకం సృష్టిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో వీరి నటనను చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 28, 2024 / 11:17 AM IST

    Sunny Leone, Priyamani Quotation Gang Trailer Talk

    Follow us on

    Priyamani, Sunny Leone: వెబ్ సిరీస్ పుణ్యమాని హీరోయిన్ల నటనా పద్ధతులు మారిపోతున్నాయి. ఒకప్పుడు హీరోయిన్ అంటే అందచందాలతో మాత్రమే కనిపించే వారు. ఆ తరువాత విజయశాంతి లాంటి వాళ్లు ప్రతిఘటన వంటి సినిమాలో ప్రత్యేకంగా కనిపించారు. అయితే ఇప్పుడు కొందు హీరోయిన్లు మొన్నటి వరకు గ్లామర్ గా కనిపించి ఆ తరువాత క్రైం స్టోరీస్ లో భిన్నంగా కనిపిస్తున్నారు. లేటేస్టుగా సన్నీ లియోన్, ప్రియమణిలు కలిసి నటించిన ఓ మూవీ అరాచకం సృష్టిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో వీరి నటనను చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.

    ఓటీటీ ప్లాట్ ఫాంపై క్రైం సిరీస్ లు ఆకట్టుకుంటున్నాయి. లేటేస్టుగా ప్రియమణి, సన్ని లియోన్, జాకీ ష్రాఫ్ నటించిన ‘QG’ పేరుతో ఓ మూవీ రాబోతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఓ గ్యాంగ్ స్టర్ డబ్బు కోసం మనుషులను చంపుతూ ఉంటారు. అయితే ఓ ముఠాను చంపిన తరువాత వీరి జీవితాలు మారిపోతాయి. గ్యాంగ్ స్టర్ లో ఇద్దరు లేడీస్ ఉంటారు. వీరిలో ఒకరు సన్ని లియోన్, మరొకరు ప్రియమణి.

    సన్నిలియోన్ అనగానే కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుడుతుంది. కానీ ఇందులోని సన్నిలియోన్ ను చూస్తే షాక్ అవుతుంది. జడ్ స్పీడ్ లో మర్డర్ చేసే వ్యక్తిగా ఇందులో కనిపించనుంది. ఊర మాస్ లెవల్లో ఉన్న ఈమె పాత్ర వైవిధ్యంగా ఉంది. సన్నిలియోన్ కనిపించగానే వణుకు పుట్టినట్లవుతుంది. ఇప్పటికే ఓటీటీ నెంబర్ వన్ హీరోయిన్ గా ప్రియమణి గుర్తింపు తెచ్చకుంది. ఇప్పుడు లేటేస్ట్ గా ఈ మూవీలో ప్రియమణి సైతం మాస్ రౌడీలాగా కనిపించింది. భయంకరమైన హత్యలు చేసేవారిలో ప్రియమణి కుడా ఉంటుంది.

    ఈ మూవీ వచ్చే నెలలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ క్రైం స్టోరీలకు ఓటీటీలో బాగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. దీనిని కూడా ఆదరిస్తారని అంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక వర్గం గురించి తెలియరాలేదు.