AP Movie ticket: ఏపీలో థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితి చూస్తుంటే.. ఏపీ సర్కార్ వర్సెస్ థియేటర్లు అన్నట్లు ఉంది. గత వారం ఏపీలో ఏకంగా 175 థియేటర్లను అధికారులు మూసేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం పెద్ద దూమారమే రేపింది. ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించడంతో.. ఎగ్జిబిటర్లు, థియేటర్ ఓనర్లు హాలును నడిపేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దానికి తోడు నిబంధనల పేరుతో అధికారులు దాడులు చేసి.. పలు థియేటర్లను మూసేస్తున్నారు.

ఈ క్రమంలోనే బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. ఇటీవల వచ్చిన పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలపై భారీ ప్రభావం పడింది. మరోవైపు తక్కువ ధరలకు మేము థియేటర్ రన్ చేయలేమంటూ.. స్వచ్ఛందంగా ఓనర్లు హాళ్లను మూసేస్తున్నారు.
మరోవైపు ఏపీకి చెందిన ఎగ్జిబిటర్లంతా సమావేశమై.. ప్రభుత్వం తమపై ఇలా కఠినంగా వ్యవహరిస్తే నిరసనకు సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దానికి తోడు ఇటీవలే ఇంకా దాడులు ఎక్కువ్యాయి. మరోవైపు డిస్టిబ్యూటర్ల నుంచి ఒత్తిడి రావడంతో పలు థియేటర్లు ఎలాగోలా నడుస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎటు చూసినా గందరగోళ వాతావరణం ఏర్పడినట్లు క్లియర్‌కట్‌గా తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు చిరంజీవి జగన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సి ఉంది.