Jack movie Twitter talk : ‘టిల్లు స్క్వేర్'(Tillu Square) వంటి సంచలనాత్మక చిత్రం తర్వాత సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరో గా నటించిన ‘జాక్'(Jack Movie) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. టిల్లు సిరీస్ తో యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న సిద్దు ఈ సినిమాతో కూడా కచ్చితంగా అలరిస్తాడని విడుదలకు ముందే ఆడియన్స్ లో ఒక స్టాంప్ పడింది. అందుకు తగ్గట్టుగానే థియేట్రికల్ ట్రైలర్ కూడా ఉండడం తో ఇక సిద్దు మరో హిట్ కొట్టేశాడు అనే ఫీలింగ్ అందరిలో కలిగింది. ఇక ప్రొమోషన్స్ లో సినిమా గురించి ఆయన మాట్లాడిన తీరు, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ముఖం లో నమ్మకాన్ని చూసి అభిమానులు మరింత అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా లేదా?, సిద్దు మరోసారి సూపర్ హిట్ కొట్టాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
#Jack at SreeRamulu theatre pic.twitter.com/da7s0LtPeq
— Srinivas Adhepalli (@SrinivasWriting) April 10, 2025
ట్విట్టర్ లో నెటిజెన్స్ నుండి వస్తున్న టాక్ ని పరిశీలిస్తే, మరో సిద్దు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడని తెలుస్తుంది. సిద్దు మార్క్ కామెడీ టైమింగ్, డైలాగ్స్ ప్రేక్షకులను ఫస్ట్ హాఫ్ లో బాగా ఎంటర్టైన్ చేస్తాయి. టిల్లు సిరీస్ లో కథ ఉండదు, కేవలం హీరో క్యారక్టర్ మీద ఆధారపడి సినిమా ఉంటుంది. కానీ ‘జాక్’ లో సాలిడ్ స్టోరీ లైన్ ఉంది, అందుకు తగ్గ స్క్రీన్ ప్లే కూడా ఉంది. హీరో క్యారక్టర్ కూడా బలగానే ఉందని చూసిన ప్రతీ ఒక్కరు చెప్తున్నారు. సిద్దు, ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయట. ఇక సెకండ్ హాఫ్ అయితే ప్రేక్షకుల అంచనాలకు మించి ఉందని తెలుస్తుంది. హీరోయిన్ వైష్ణవి చైతన్య క్యారక్టర్ ఇచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పేలాయి.
Thanks for #Jack movie review
Blockbuster #Jack pic.twitter.com/9ZgN9Vf2ER— MONISH DHFM ✨ (@hereismonish) April 10, 2025
ఓవరాల్ గా ఈ చిత్రం ఎలా ఉందంటే, సిద్దు నుండి ఆడియన్స్ ఏవైతే ఆశిస్తారో అవన్నీ ఉంటూనే, మంచి ఇంటెన్సిటీ ఉన్న స్క్రీన్ ప్లే తో ఆద్యంతం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా సినిమా ఉందని తెలుస్తుంది. లవ్ స్టోరీస్ మరియు సున్నితమైన అంశాలతో సినిమాలు చేసే బొమ్మరిల్లు భాస్కర్ లో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా అని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యానికి గురయ్యారు. పాటలు పెద్దగా హిట్ అవ్వకపోవడం వల్ల ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు. కానీ ఇప్పుడు పాజిటివ్ టాక్ రావడంతో సిద్దు ఇక తన బాక్స్ ఆఫీస్ మ్యాజిక్ ని రీ క్రియేట్ చేస్తాడని, మరోసారి వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడుతాడని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది.
Show time – #Jack #siddu #VaishnaviChaithanya pic.twitter.com/TOyvZFRHRR
— Abhiram (@Wolf83343) April 10, 2025
showtime: #Jack #SiddhuJonnalagadda #vaishnavichaitanya pic.twitter.com/8nWEwt0KIT
— rajesh! (@rajeshs0905) April 9, 2025
#Jack ఇదంతా మన బొమ్మరిళ్లు, orange భాస్కర్ తీశాడా?
Star boy bagged another block buster … Very engaging with solid entertainment pic.twitter.com/QBFRdK6GL2— Boss Baby (@pepparsalt9) April 9, 2025