Jack : ‘డీజే టిల్లు’ సిరీస్ తో యూత్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో అలరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda), నిన్న ‘జాక్'(Jack Movie) మూవీ తో మన ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ యాక్షన్ కమ్ కామెడీ ఎంటర్టైనర్ కి మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా హీరో సిద్దు జొన్నలగడ్డ క్యారక్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఆడియన్స్ ని విశేషంగా అలరించింది. సిద్దు మార్క్ టైమింగ్ కి మరో సారి మంచి మార్కులు పడ్డాయి. విడుదలకు ముందు పెద్దగా అంచనాలను క్రియేట్ చేయకపోయినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి మొదటి రోజు డీసెంట్ స్థాయి ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి.
Also Read : ‘జాక్’ ఓపెనింగ్స్ అదుర్స్..సైలెంట్ గా వచ్చి దున్నేస్తున్నాడుగా!
బుక్ మై షో యాప్ లో మొదటి రోజు ఈ చిత్రానికి 31 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఎలాంటి అంచనాలను క్రియేట్ చేయలేకపోయిన ఈ సినిమాకు, మిడ్ వీక్ రిలీజ్ లో ఈ స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోవడం అనేది సాధారణమైన విషయం కాదు. ఎన్నో ఏళ్ళ నుండి ఇండస్ట్రీ లో పాతుకుపోయిన కొంతమంది హీరోలకు ఇలాంటి ఫీట్స్ సాధపడట్లేదు. ఓవర్సీస్ లో కూడా పర్లేదు అనే రేంజ్ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చిందని అంటున్నారు. ఇది చాలా డీసెంట్ ఓపెనింగ్ అనే చెప్పాలి.
వచ్చిన ప్రతీ పైసా సిద్దు పేరు మీదనే వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘టిల్లు స్క్వేర్’ లాంటి సంచలనాత్మక చిత్రం తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 18 కోట్ల రూపాయలకు జరిగింది. వీకెండ్ పూర్తి అయ్యే సమయానికి కచ్చితంగా 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. టాక్ బాగానే ఉంది కాబట్టి లాంగ్ రన్ కచ్చితంగా ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. వర్కింగ్ డేస్ లో డీసెంట్ స్థాయి హోల్డ్ ని చూపించగలిగితే కచ్చితంగా ఈ చిత్రం ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇంకా ఎక్కువ కూడా కలెక్ట్ చేయొచ్చు.చూడాలి మరి
Also Read : జాక్ ఫుల్ మూవీ రివ్యూ