Good Bad Ugly : తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన అజిత్(Thala Ajith) రెండు నెలల క్రితమే తమిళ ఇండస్ట్రీ కి ‘విడాముయార్చి’ వంటి పెద్ద ఫ్లాప్ ని అందించాడు. ఆయన అభిమానులు ఈ సినిమాని చూసి ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు. అసలు హీరోయిజం లేదు, అజిత్ స్థాయిలో ఉన్న హీరో చేసే సినిమా కాదంటూ వాపోయారు. కానీ నిన్న విడుదలైన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) చిత్రం తో ఆయన అభిమానుల్లో నింపిన జోష్ సాధారణమైనది కాదు. అజిత్ సినిమాని చూసి అభిమానులు చాలా కాలం తర్వాత నూటికి నూరు శాతం సంతృప్తి చెందినది ఈ చిత్రంతోనే అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా కళ్ళు చెదిరే రేంజ్ లోనే వచ్చాయి. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
Also Read : ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫుల్ మూవీ రివ్యూ…
ఆన్లైన్ టికెట్ సేల్స్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా నిన్న ఈ చిత్రానికి కేవలం తమిళనాడు ప్రాంతం నుండి 22 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇది కేవలం ఆన్లైన్ టికెట్ సేల్స్ ని ఆధారంగా చేసుకొని చెప్పిన లెక్కలు మాత్రమేనట. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని కూడా పరిగణలోకి తీసుకుంటే, ఈ చిత్రానికి మొదటి రోజున 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. తమిళనాడు లో అజిత్ కి ఓపెనింగ్స్ విషయం లో ఎలాంటి ఢోకా లేదు కానీ, ఆయన గత చిత్రాల ప్రభావం కారణంగా నార్త్ అమెరికా లో కాస్త మార్కెట్ డౌన్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో అదే విధంగా కర్ణాటక లో కూడా అజిత్ కి విజయ్, రజినీకాంత్ కి ఉన్నంత మార్కెట్ లేదు. కానీ ఈ చిత్రానికి వరకు డీసెంట్ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయి.
ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో కాస్త తగ్గినప్పటికీ, మలేషియా, శ్రీలంక మరియు గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రానికి సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయి. అక్కడి ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి మొదటి రోజున 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రెండు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది విడాముయార్చి ఓపెనింగ్స్ కి డబుల్ అనే చెప్పొచ్చు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడుపోయిన టికెట్స్ గురించి కాసేపు పక్కన పెడితే, నిన్న బుక్ మై షో లో జరిగిన లైవ్ టికెట్ సేల్స్ దాదాపుగా మూడు లక్షల 55 వేలు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 65 నుండి 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ లో ఈ ఒక్కటి గమనించారా..?