Suma Cash Show : ఇప్పుడు తెలుగు బుల్లితెరపై రియాలిటీ షోల సంఖ్య చాలా పెరిగిపోయింది. ఆ ఛానల్.. ఈ ఛానల్ అన్న తేడాలేకుండా ఒకరిని చూసి ఒకరు రియాలిటీ షోలపై ఫోకస్ పెట్టారు. కామెడీని ఆస్వాదించే వారి సంఖ్య పెరగడంతో.. దాదాపు మెజారిటీ షోలు హాస్యం ప్రధానంగా సాగుతున్నాయి. ఇలాంటి వాటిల్లోకి కొత్త కొత్త ఆర్టిస్టులు వచ్చేస్తున్నారు. తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు. అలా వచ్చిన వారిలో రోహిణి, జబర్దస్త్ వర్ష ఉన్నారు. వీరు తాజాగా సుమ హోస్టుగా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ కు వెళ్లారు. అక్కడ వీరిద్దరూ నిజంగానే పంచాయితీకి దిగడం కలకం రేపింది.
నటి రోహిణి సీనియరే. ఇరవై ఏళ్ల వయసులోనే టీవీ స్క్రీన్ కు పరిచయమైన ఆమె.. ముందుగా సీరియళ్లలో నటించింది. ఆ తర్వాత.. బిగ్ బాస్ షోలోకి సైతం వెళ్లింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత.. వరుస ఆఫర్లు అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక, వర్ష ఒక మోడల్. ఆ తర్వాత పలు సీరియళ్లలోనూ నటించింది. ఇప్పుడు వీళ్లిద్దరూ జబర్దస్త్ షోలో భాగమయ్యారు. తమదైన యాక్టింగ్ తో, కామెడీతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
వీళ్లిద్దరూ సుమ యాంకర్ గా ఉన్న క్యాష్ ప్రోగ్రామ్ కు వెళ్లారు. ఈ షోకు ఎంత పాపులారిటీ ఉందో తెలిసిందే. నిత్యం ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చి పోతుంటారు. తాజాగా.. రోహిణి, జబర్దస్త్ వర్ష తోపాటు లహరిత, శ్రీసత్య, అంకిత, స్రవంతి, ఐశ్వర్య పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఇందులో ఎవరికి వారు పంచ్ లు వేస్తూ నవ్వించే ప్రయత్నం చేశారు. అయితే.. చివర్లో చోటు చేసుకుంటున్న సంఘటన సంచలనం రేకెత్తించింది.
జబర్దస్త్ వర్ష రోహిణిని బాడీ షేమింగ్ చేసింది. ‘ఒరేయ్ బండా.. రెడీ రా’ అంటూ పరోక్షంగా రోహిణి లావుగా ఉందని అన్నది. దీంతో.. రోహిణి ఆగ్రహం వ్యక్తం చేసింది. బండా అన్నావంటే ఎత్తి అవతల పడేస్తా.. మాట్లాడితే బాడీ మీద కామెంట్ చేస్తావేంటీ? అని సీరియస్ అయ్యింది. అంతటితో ఆగకుండా.. ‘నువ్వు సన్నగా ఉంటే.. అది నీ బాడీ తత్వం. నన్ను ఇలా అనొద్దు. అసలు వర్ష ఉంటే నేను రాకపోదును’ అనేసింది. దీనికి వర్ష కూడా అదేవిధంగా రియాక్ట్ అయ్యింది. ‘రోహిణి ఉంటే నేను కూడా రాను’ అనడంతో గొడవ తారస్థాయికి చేరింది. దీంతో.. వర్ష కింద పడి ఏడ్చింది. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు షో విడిచి వెళ్లిపోయారు.