Jabardhast rating తెలుగు బుల్లితెరపై ఎవర్ గ్రీన్ షో ‘జబర్ధస్త్’. నంబర్ 1 కామెడీ షోగా ఇది పేరు తెచ్చుకుంది. ఈ షోలో ఎన్ని బూతులు, కాంట్రావర్సీ ఉన్నా కూడా ఇప్పటివరకూ దీన్ని బీట్ చేసిన వారు ఎవరూ లేరు. మిగతా షోల కంటే జబర్ధస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ వెండితెరకు పరిచయం అయ్యారు. చాలా మంది జబర్ధస్త్ తో ఎదిగారు. కొంతమంది బయటకు వెళ్లిపోయారు. సుధీర్, హైపర్ ఆది, గెటప్ శీను లాంటి చాలామంది బయటకు వెళ్లి బాగా స్థిరపడ్డారు.అయితే సుధీర్, హైపర్ ఆది, అనసూయ సహా చాలా మంది జబర్ధస్త్ నుంచి వెళ్లిపోవడంతో షో రేటింగ్ బాగా తగ్గింది. మునుపటిలా దీనికి అస్సలు రేటింగ్ రావడం లేదు.

ఈక్రమంలోనే జబర్ధస్త్ రేటింగ్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు కమెడియన్ అప్పారావు. 2013లో మొదలైన జబర్ధస్త్ షో చాలా తక్కువ కాలంలోనే భారీ స్థాయిలో రేటింగ్స్ సొంతం చేసుకుంది. 2014 నుంచి నాన్ స్టాప్ గా ఈ షోకు భారీ స్థాయిలో రేటింగ్స్ దక్కుతోంది. మల్లెమాలకు ఐదేళ్ల పాటు కాసుల వర్షం కురిపించింది.
మొదట్లో చిన్న కమెడియన్ కు కూడా ఒక్కో ఎపిసోడ్ కు రూ.10వేలకు పైగా పారితోషికం వచ్చేంది. ఇక ఇప్పుడు టీం లీడర్ గా మారిన వారికి ఎపిసోడ్ కు రూ. 2లక్షలకు పైగానే పారితోషికం అందుకున్నారు. సీనియర్ కమెడియన్స్ వెళ్లిపోతూ ఉండడంతో కళ తప్పింది. ఒకప్పుడు కనిపించిన జోరు ఇప్పుడు జబర్ధస్త్ లో కనిపించడం లేదు. నాగబాబు, రోజా వెళ్లిపోయాక అసలు షోకు ఊపు లేకుండా పోయింది.
అప్పట్లో జబర్ధస్త్ కు ఏకంగా 18 టీఆర్పీ రేటింగ్స్ వచ్చేది. ఇదే అత్యధికం. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయి 4 నుంచి 6 రేటింగ్స్ కు పడిపోయింది. కొంతమంది దారుణమైన ప్రవర్తన కారణంగానే అక్కడి నుంచి చాలామంది కమెడియన్స్ వెళ్లిపోతున్నట్లుగా చెబుతున్నారు.
ఒకప్పుడు టాప్ రేటింగ్ తో భారీగా ఆర్జించిన షో ఇప్పుడు తేలిపోతోంది. దాంతో కమెడియన్స్ కు ఇచ్చే పారితోషికం తగ్గిపోతోందట.. పెంచలేమని చెప్పేస్తున్నారు. దీంతో ఇక టాప్ కమెడియన్స్ అంతా షో నుంచి వెళ్లిపోతున్నారు. అందుకే షో రేటింగ్ కూడా పడిపోతోంది.