Homeఎంటర్టైన్మెంట్Hyper Aadi vs Anasuya truth: హైపర్ ఆది వల్లే జబర్దస్త్ వదిలేశా, వెళ్ళేటప్పుడు వేడుకున్నా,...

Hyper Aadi vs Anasuya truth: హైపర్ ఆది వల్లే జబర్దస్త్ వదిలేశా, వెళ్ళేటప్పుడు వేడుకున్నా, అనసూయ సంచలన కామెంట్స్

Hyper Aadi vs Anasuya truth: తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని అనసూయ ఎందుకు మానేశారు? అనే సందేహాలు చాలా కాలంగా ఉన్నాయి. పలు సందర్భాల్లో అనసూయ దీనిపై స్పందించారు. వివిధ కారణాలు చెప్పింది. అయితే తాను జబర్దస్త్ వదిలేయడానికి హైపర్ ఆదినే కారణం అంటూ బాంబు పేల్చింది అనసూయ.

Also Read:  బిగ్ బాస్ 9′ లో ఎప్పుడూ లేని సరికొత్త రూల్స్..కంటెస్టెంట్స్ ని ఏమి చేయాలనుకుంటున్నారు?

2013లో జబర్దస్త్(JABARDASTH) కామెడీ షో ప్రయోగాత్మకంగా మొదలైంది. ఎవరూ ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా యాంకర్ అనసూయ భరద్వాజ్ అనతికాలంలో ఫేమ్ రాబట్టింది. అనసూయ గ్లామర్ కి జబర్దస్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. జబర్దస్త్ షోతో వచ్చిన ఫేమ్ తో అనసూయ యాంకర్ గా బిజీ అయ్యింది. జబర్దస్త్ కి అనసూయ(ANASUYA BHARADWAJ), ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ గౌతమ్ యాంకర్స్ గా వ్యవహరించారు. దాదాపు 9 ఏళ్ళు జబర్దస్త్ లో కొనసాగిన అనసూయ 2022లో తప్పుకుంది. నటిగా బిజీ కావడం వలన, డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనసూయ వివరణ ఇచ్చింది.

జబర్దస్త్ నుండి బయటకు వచ్చేశాక పరోక్షంగా ఆరోపణలు చేయడం విశేషం. కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసేవారని, మనం అసహనం ప్రదర్శించినా దాన్ని ఎడిటింగ్ లో లేపేసేవారని అన్నారు. అలాగే టీఆర్పీ స్టంట్స్ నచ్చకపోవడం కూడా ఒక కారణం అని అనసూయ చెప్పుకొచ్చింది. కాగా ఎట్టకేలకు అసలు రీజన్ బయటపెట్టింది. హైపర్ ఆది(HYPER AADI) వలనే జబర్దస్త్ వదిలేశానని ఓపెన్ కామెంట్స్ చేసింది. జబర్దస్త్ 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా సెలెబ్రేషన్స్ పేరుతో… రీ యూనియన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు.

ఈ ఎపిసోడ్ కి గతంలో జబర్దస్త్ లో సందడి చేసిన పలువురు కమెడియన్స్ రీ ఎంట్రీ ఇచ్చారు. చివరికి నాగబాబు సైతం హాజరయ్యారు. అనసూయ ఈ ఎపిసోడ్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలవనవుంది. కాగా బుల్లితెర కమెడియన్ హైపర్ ఆది మీద తనకున్న అసహనాన్ని అనసూయ బయటపెట్టింది. పనిలో పనిగా హైపర్ ఆది మీద పంచులు వేసింది. ‘ఆది పొట్ట లోపలికి లాక్కో’ అని ఫస్ట్ ఒక పంచ్ వేసింది. వెళ్లే ముందు వద్దు ఆది వద్దు ఆది అని ఎంత బ్రతిమిలాడుకున్నాను. ఇంట్లో వాళ్లకు చెప్పేస్తాను అన్నాను. నాతో పాటు స్కిట్ చేసి, ఎంత ఎంకరేజ్ చేశాను. కానీ నా ఎక్స్క్లూజీవిటీ ఏడవలేదు, అది నా ఏడుపు.. అంటూ హైపర్ ఆది మీద అనసూయ ఫైర్ అయ్యింది.

Also Read: జబర్దస్త్ పొట్టి నరేష్ క్రేజీ లవ్ స్టోరీ, పెళ్లి పీటల మీద నుండి వచ్చేసేది!

నువ్వు అమెరికా వెళ్లినా లింకులు పంపుతారా… అది నీకు నాకు ఉన్న లింక్… అని అనసూయ మీద పంచ్ వేశాడు హైపర్ ఆది. ఇందుకే నేను వెళ్ళిపోయింది.. అంటూ అనసూయ విమర్శలు గుప్పించింది. తాను జబర్దస్త్ మానేయడానికి హైపర్ ఆది కూడా ఒక కారణం అని చెప్పకనే చెప్పింది. జబర్దస్త్ కి ప్రధాన ఆకర్షణగా మారిన హైపర్ ఆది, యాంకర్ అనసూయ మీద కూడా పంచ్ లు వేసేవాడు. హైపర్ ఆది స్కిట్స్ లో అనసూయ నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అనసూయ అయిష్టంగా చేసినట్లు మనం భావించవచ్చు. హైపర్ ఆది స్కిట్స్ లో నటించినా.. దాని వలన తనకు దక్కింది శూన్యం అన్నట్లు అనసూయ ఆవేదన ఉంది. ఇక పూర్తి ఎపిసోడ్ ఆగస్టు 1న ప్రసారం కానుంది. అనసూయ ఇంకా ఎలాంటి ఆరోపణలు చేసిందో చూడాలి..

YouTube video player

Exit mobile version