Jabardasth Naresh Biography: జబర్దస్త్ ప్రొగ్రాం ఎంతో మందికి జీవితాన్నిచ్చింది. ఈ షో ద్వారా కామెడీ స్కిట్లు చేసిన కొందరు అత్యున్నత స్థాయికి ఎదిగారు. సుడిగాలి సుధీర్ ఓ సినిమాలో హీరోగా కూడా చేశారు. ఇంకా చాలా మంది జబర్దస్త్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్లు సినిమాల్లో కొనసాగుతున్నారు. ఈ ప్రొగ్రాం ద్వారా పాపులారిటీ సాధించిన నటుల్లో నరేశ్ ఒకరు. బుల్లెట్ భాస్కర్ టీం లో నరేశ్ కనిపిస్తాడు. స్కిట్ లో భాగంగా నరేశ్ ను అప్పుడప్పుడు భాస్కర్ ఎత్తుకునేవాడు. దీంతో చాలా మంది నరేశ్ చాలా చిన్న పిల్లవాడు అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిశాక నోరెళ్లబెట్టారు. ఆయన చిన్నపిల్లాడు కాదని ఆయన వయసు 20 ఏళ్లు ఉంటుందని తెలిసి ఆశ్చర్యపోయారు. దీంతో కొందరు నరేశ్ ఇలా ఎందుకు మారాడు..? ఆయన పెరగకపోవడానికి కారణమేంటి..? అనే విషయాల గురించ సెర్చ్ చేస్తున్నారు.

కేవలం మూడు అడుగులు మాత్రమే ఉన్న నరేశ్ కు ఓటు హక్కు కూడా ఉంది. కానీ ఆయన జబర్దస్త్ లో పంచ్ లు వేస్తే పటాకల్లా పేలిపోతాయి. గొంతు చిన్నదైనా చెప్పే డైలాగులు భారీగా ఉంటాయి. మిగతా నటులంతా ఈయనను తలదించి చూస్తే నరేశ్ మాత్రం తలెత్తి చూస్తాడు. అయితే జన్యు లోపం కారణంగా నరేశ్ హైట్ పెరగలేదు. కానీ అలా ఎదగకపోయినా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతర స్టార్లతో సమానంగా కామెడీ చేస్తూ ప్రత్యేక పేరు తెచ్చుకున్నాడు. ఇంతకీ నరేశ్ బయోగ్రఫీ ఎంటో తెలుసుకుందాం..
Also Read: Pooja Hegde: ప్రభాస్ గురించి పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో పుట్టాడు నరేశ్. ఈ జిల్లాలోని అనంతపురం అనే గ్రామంలో 2000 సంవత్సరంలో జన్మించారు. నరేశ్ నిరుపేద కుటుంబంలో పుట్టడంతో ఆయన తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చారు. జోడుప్పల్ లోని కాకతీయ స్కూల్ లో 5వ తరగతి వరకు చదివిన నరేశ్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయితే చిన్నప్పటి డ్యాన్స్ అంటే ఇష్టమున్న నరేశ్ మొదట ఢీ జూనియర్స్ ప్రొగ్రాంలో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత అతని టాలెంట్ చూసిన సునామీ సుధాకర్ చంటి టీంలో నటించే అవకాశం ఇచ్చాడు. అది హిట్టు కావడంతో పటాస్ ప్రకాశ్ తనటీంలోనూ ఛాన్స్ ఇచ్చాడు.

ఇక తనను పరిచయం చేసిన సునామి సుధాకర్, బుల్లెట్ భాస్కర్ టీంలో ఉండడంతో ఇందులోనే కొనసాగుతున్నాడు. ఆ తరువాత నరేశ్ కు స్టార్డమ్ వచ్చింది. తనదైన పంచ్ లతో పిచ్చెక్కిస్తుంటాడు. మిగతా ఆర్టిస్టులు స్కిట్ ప్రాక్టిస్ చేస్తే నరేశ్ మాత్రం స్కిట్ ఓపెన్, ఎండ్ తెలుసుకొని స్టేజీపైనే ఫర్ఫామెన్స్ చేస్తుంటాడు. దీంతో నరేశ్ వల్లే తన టీంకు మంచి పేరు వచ్చిందని చెబుతుంటాడు బుల్లెట్ భాస్కర్. ఇక నరేశ్ బుల్లెట్ భాస్కర్ టీంలోనే కాకుండా మిగతా టీంలలోనూ కనిపిస్తుంటాడు. ఇక జబర్దస్త్ లోనే కాకుండా ఉదయబాను గ్యాంగ్ లీడర్లోనూ నరేశ్ తన ప్రతిభను చూపించాడు.
ప్రస్తుతం నరేశ్ మంచి పొజిషన్లో ఉన్నాడు. హైదరాబాద్లోనే ఓ ప్లాట్ తీసుకున్నాడు. ఆ తరువాత సొంతూళ్లో ఇల్లు కూడా కట్టుకుననాడు. మొత్తానికి పదేళ్ల పిల్లాడిలా కనిపించే నరేశ్ బుల్డోజర్ పంచ్ లు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. జబర్దస్త్ లో ఆయన ఆ ఎంట్రీ ఇస్తే ఈలలు, గోలలు వినిపిస్తాయి.
Also Read: ప్రభాస్-అనుష్క ల పెళ్లి పై టంగ్ స్లిప్ అయిన కృష్ణం రాజు గారి సతీమణి ఏమన్నారంటే ?