Jabardasth Faima : అతడికి హ్యాండ్ ఇచ్చి కొత్త బాయ్ ఫ్రెండ్ ని పట్టేసిన జబర్దస్త్ ఫైమా… మేటర్ లీక్ చేసిన బుల్లెట్ భాస్కర్!

ప్రస్తుతం ఫైమా  జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ  షోలు చేస్తుంది.  పేద కుటుంబం నుంచి వచ్చిన ఫైమా తన టాలెంట్ తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా సొంతింటి కల కూడా నెరవేర్చుకుంది. 

Written By: NARESH, Updated On : March 29, 2024 2:55 pm
Follow us on

Jabardasth Faima : జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన లేడీ కమెడియన్స్ లో ఫైమా ఒకరు. మొదట్లో  స్టాండప్ కమెడియన్ గా పటాస్ షోలో అలరించింది. ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బుల్లెట్ భాస్కర్ టీం లో ఎక్కువగా స్కిట్స్ చేసిన ఫైమా, పలువురు టీమ్ లీడర్స్ తో పని చేసింది.  తనకంటూ ఓ కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ క్రియేట్ చేసుకుని, ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా పటాస్ షో చేస్తున్నప్పుడు ప్రవీణ్ తో కలిసి కామెడీ స్కిట్లు చేసేది. అలా వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అయ్యారు. 
 
జంటగా యూట్యూబ్ వీడియోలు కూడా చేసేవారు. తాము ప్రేమించుకున్నట్లు పలుమార్లు చెప్పుకొచ్చారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. బిగ్ బాస్ షో లో కూడా ఫైమా,  ప్రవీణ్ గురించి చాలా సార్లు ప్రస్తావించింది. బయటకు వచ్చిన తర్వాత ఏమైందో కానీ .. ఫైమా, ప్రవీణ్ కలిసి ఎక్కడా కనిపించలేదు. అగ్రిమెంట్ కారణంగా కొంతకాలం స్టార్ మా లో పని చేసింది ఫైమా. స్టార్ మాలో ప్రసారమైన బీబీ జోడిలో కంటెస్ట్ చేసి విన్నర్ గా నిలిచింది. 
 
స్టార్ మా అగ్రిమెంట్ ముగియడంతో జబర్దస్త్ కి రీఎంట్రీ ఇచ్చింది.బుల్లెట్ భాస్కర్ టీం లో చేస్తుంది. ప్రవీణ్ తో మాత్రం ఎడ మొహం పెడ మొహం గా ఉంటుంది. దీంతో వీళ్లిద్దరు విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఫైమా అతడికి బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తుంది. ఫైమా, ప్రవీణ్ విడిపోయారని వార్తలు వస్తున్న నేపథ్యంలో భాస్కర్ కన్ఫర్మ్ చేసాడు. గత వారం ప్రసారమైన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో భాస్కర్ .. ఫైమా కి దిమ్మతిరిగే పంచ్ వేసాడు. 
 
స్కిట్ లో భాగంగా భాస్కర్ .. ‘ వెంట వెంటనే మార్చడానికి వాడు బాయ్ ఫ్రెండ్ కాదు ‘ అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఫైమా బ్రేకప్ నిజమేనని అంతా అనుకుంటున్నారు. అదే సమయంలో ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరనే ఆలోచనలో పడ్డారు.  ప్రస్తుతం ఫైమా  జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ  షోలు చేస్తుంది.  పేద కుటుంబం నుంచి వచ్చిన ఫైమా తన టాలెంట్ తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా సొంతింటి కల కూడా నెరవేర్చుకుంది.