https://oktelugu.com/

Rashmi: తోబుట్టువులు చనిపోయారు.. దత్తత తీసుకోండి.. రష్మీ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Rashmi: యాంకర్ రష్మీ బుల్లితెరపై పలు షోలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బుల్లితెర షోల ద్వారా రష్మీకి అంచనాలకు మించి రెమ్యునరేషన్ దక్కుతోంది. రష్మీ గురించి సోషల్ మీడియాలో వేర్వేరు గాసిప్స్ ప్రచారంలోకి వచ్చినా ఆ గాసిప్స్ ను రష్మీ అస్సలు పట్టించుకోరు. అయితే మూగజీవాలకు రష్మీ ఇచ్చే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. మూగజీవాలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకునే విషయంలో రష్మీ ముందువరసలో ఉంటారు. రష్మీ షేర్ చేసిన పోస్ట్ లో నా పేరు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 23, 2022 / 09:53 AM IST
    Follow us on

    Rashmi: యాంకర్ రష్మీ బుల్లితెరపై పలు షోలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బుల్లితెర షోల ద్వారా రష్మీకి అంచనాలకు మించి రెమ్యునరేషన్ దక్కుతోంది. రష్మీ గురించి సోషల్ మీడియాలో వేర్వేరు గాసిప్స్ ప్రచారంలోకి వచ్చినా ఆ గాసిప్స్ ను రష్మీ అస్సలు పట్టించుకోరు. అయితే మూగజీవాలకు రష్మీ ఇచ్చే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. మూగజీవాలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకునే విషయంలో రష్మీ ముందువరసలో ఉంటారు.

    రష్మీ షేర్ చేసిన పోస్ట్ లో నా పేరు గోల్డీ అని తాను అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతానని నాకు కావాల్సింది ఫుడ్, ఆహారం అని కుక్క చెబుతున్నట్టు పేర్కొన్నారు. నా తోబుట్టువులు చనిపోయారని తాను మాత్రమే చెత్త నుండి బయటపడ్డానని నన్ను ఎప్పటికీ లవ్ చేసే మంచి ఇంటి కొరకు ఎదురుచూస్తున్నానని మీరు ఈ పోస్ట్ ను చదువుతుంటే నన్ను దత్తత తీసుకోవాలని గోల్డీ అనే కుక్క చెబుతున్నట్టు ఉంది.

    Also Read: IPL 2022: నాడు ధోని.. నేడు పంత్ అచ్చం అలానే చేశారు.. కానీ..!

    సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. మూగజీవాలపై ప్రేమ ఉన్నవాళ్లు గోల్డీని పెంచుకోవడానికి పోస్ట్ లో ఉన్న నంబర్ ను సంప్రదించవచ్చు. కుక్కలను ఎవరైనా హింసించినా రష్మీ అస్సలు తట్టుకోలేరు. రష్మీ ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోతో పాటు పలు ఈవెంట్లలో మెరుస్తున్న రష్మీ ఆయా ఈవెంట్ల ద్వారా కూడా పాపులారిటీని పెంచుకుంటున్నారు.

    రష్మీకి క్రేజ్ రోజురోజుకు పారితోషికం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. రష్మీ సినిమాలలో వచ్చిన ఆఫర్లను సైతం సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. రష్మీ నటించిన బొమ్మ అదిరింది సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. రష్మీకి పలు కొత్త సినిమాలలో కూడా ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.

    Also Read: Prashant Kishor- YCP: పొత్తుల కత్తులు.. ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదనాలపై వైసీపీ నేతల ఘాటు వ్యాఖ్యలు

    Recommended Videos: