Mahesh Babu : మహేష్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరో టాక్ తో సంబంధం లేకుండా మహేష్ బాబు చిత్రాలకు వసూళ్లు దక్కుతాయి. కృష్ణ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చి భారీ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. మహేష్ బాబుని అందానికి చిరునామాగా చెప్పుకుంటారు. దేశంలో ఉన్న అతి కొద్ది మంది అందమైన హీరోల్లో మహేష్ బాబు ఒకరిగా ఉన్నారు. ఆయన నటన అద్బుతంగా ఉంటుంది. ఎమోషన్ ఏదైనా అలవోకగా పలికిస్తాడు. డైలాగ్ డెలివరీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
అయితే మహేష్ బాబుకి ఓ కమెడియన్ డబ్బింగ్ చెబుతాడన్న న్యూస్ కాకరేపుతుంది. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. కొన్ని సినిమాలు, యాడ్స్ లో మహేష్ బాబుది అనుకుంటున్న ఆ వాయిస్ ఆయనది కాదు. జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో ఒకరైన బుల్లెట్ భాస్కర్ పలుమార్లు మహేష్ బాబుకి డబ్బింగ్ చెప్పారట. ఓ మూవీకి కూడా ఆయన డబ్బింగ్ చెప్పారట. మహేష్ బాబు బిజీగా ఉంటారు. కొన్ని సమయాల్లో ఆయన తాను నటించిన యాడ్స్ కి డబ్బింగ్ చెప్పడం కుదరదు అట. అప్పుడు వారు బుల్లెట్ భాస్కర్ ని సంప్రదిస్తారట.
ఆయన మహేష్ బాబుకి తన వాయిస్ అరువు ఇస్తారట. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన వన్ నేనొక్కడినే చిత్రంలో మహేష్ పాత్రకు కూడా తాను డబ్బింగ్ చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో బుల్లెట్ భాస్కర్ వెల్లడించారు. బుల్లెట్ భాస్కర్ ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్. చిరంజీవి, ప్రకాష్ రాజ్, ఎమ్మెస్ నారాయణ, కొండవలస, కృష్ణంరాజు, కృష్ణ వంటి పలువురు నటుల వాయిస్ మిమిక్రీ చేస్తారు. ఎమ్మెస్ నటించిన కొన్ని చిత్రాలకు డబ్బింగ్ చెప్పకుండానే కన్నుమూశారు. ఈ క్రమంలో బుల్లెట్ భాస్కర్ మిమిక్రీ చేశాడట. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో మనకు వినిపించేది ఎంఎస్ ఒరిజినల్ వాయిస్ కాదు.
అయితే కేవలం అరుదైన సందర్భాల్లో మాత్రమే బుల్లెట్ భాస్కర్ తో మహేష్ బాబుకి డబ్బింగ్ చెప్పిస్తారు. మహేష్ బాబు స్వయంగా తన సినిమాలకు డబ్బింగ్ చెప్పుకుంటారు. ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29కి సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రం జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుందట. రాజమౌళి దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కించనున్నారు. జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా, పాన్ వరల్డ్ మూవీగా విడుదల కానుంది.